ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?

  • Published By: vamsi ,Published On : March 30, 2019 / 07:54 AM IST
ఐపిఎల్-2019: నేడు రెండు మ్యాచ్‌లు.. గెలిచేదెవరు?

Updated On : March 30, 2019 / 7:54 AM IST

నేడు(2019 మార్చి 30) ఐపిఎల్-2019లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ 4గంటలకు కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌కు ముంబై ఇండియన్స్‌కు మధ్య జరగనుండగా.. రెండవ మ్యాచ్ 8గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు మధ్య జరగనుంది. పాయాంట్ల పట్టికలో కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ 5వ ప్లేస్‌లో ఉండగా..  ముంబై ఇండియన్స్ 6వ ప్లేస్‌లో ఉంది. అలాగే కొల్‌కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మూడవ స్థానంలో ఉంది.
Read Also : నోటాకు వ్యతిరేకంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వినూత్న ప్రచారం

ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లో గెలవగా.. రెండు పాయింట్లు దక్కించుకుంది. అలాగే కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లో నెగ్గింది. కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌‌కు కూడా 2పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌లలోనూ విజయం దక్కించుకుని మూడవ మ్యాచ్‌‌కు కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై అధ్భుతమైన విజయం అందుకోగా రెండవ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.  మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. రెండవ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ హాట్ ఫేవరేట్‌గా ఉంది.
Read Also : ఒకే గదిలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా