Tim David : ఓర్నీ డేవిడ్‌.. ఐపీఎల్‌లో ఇలా ఎందుకు ఆడ‌వోయి.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్‌గా..

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Tim David : ఓర్నీ డేవిడ్‌.. ఐపీఎల్‌లో ఇలా ఎందుకు ఆడ‌వోయి.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆసీస్ బ్యాట‌ర్‌గా..

WI vs AUS 3rd t20 Tim David smashes fastest T20I hundred for Australia

Updated On : July 26, 2025 / 9:46 AM IST

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు టిమ్ డేవిడ్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆస్ట్రేలియా త‌రుపున‌ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించాడు. సెయింట్ కిట్స్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో డేవిడ్ కేవ‌లం 37 బంతుల్లోనే సెంచ‌రీ సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 11 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఇంత‌క‌ముందు ఆస్ట్రేలియా త‌రుపున ఫాస్టెస్ట్ టీ20 సెంచ‌రీ సాధించిన రికార్డు జోష్ ఇంగ్లిష్ పేరిట ఉండేది. అత‌డు స్కాట్లాండ్ పై 43 బంతుల్లోనే శ‌త‌క్కొట్టాడు. తాజాగా ఇంగ్లిష్‌ను టిమ్ డేవిడ్ అధిగ‌మించాడు. ఇక ఓవ‌రాల్‌గా టెస్టు మ్యాచ్‌లు ఆడే స‌భ్య దేశాల జాబితాను తీసుకుంటే రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ మిల్ల‌ర్, రోహిత్ శ‌ర్మ‌లు సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నారు.

Jorich van Schalkwyk : వైభ‌వ్ సూర్య‌వంశీవి మాట‌లే.. చేత‌ల్లో చూపించిన ద‌క్షిణాఫ్రికా చిచ్చ‌ర‌పిడుగు.. వామ్మో ఏమా కొట్టుడు సామీ..

టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు వీరే.. (టెస్టు క్రికెట్ ఆడే దేశాలు పాల్గొన్న మ్యాచ్‌లు)

డేవిడ్ మిల్ల‌ర్ (ద‌క్షిణాఫ్రికా) – 35 బంతుల్లో బంగ్లాదేశ్ పై
రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 35 బంతుల్లో శ్రీలంక‌పై
టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) – 37 బంతుల్లో వెస్టిండీస్ పై
అభిషేక్ శ‌ర్మ (భార‌త్‌) – 37 బంతుల్లో ఇంగ్లాండ్ పై
జాన్సన్ చార్లెస్ (వెస్టిండీస్‌) – 39 బంతుల్లో వెస్టిండీస్ పై
సంజూ శాంస‌న్ (భార‌త్‌) – 40 బంతుల్లో బంగ్లాదేశ్ పై

ఇక మ్యాచ్ విషయానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు చేసింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ షై హోప్ (102 నాటౌట్; 57 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్టాడు. బ్రెండ‌న్ కింగ్ (62; 36 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు.

Joe root : 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో జోరూట్ సంచ‌ల‌నం.. టెండూల్క‌ర్ ఒక్క‌డే మిగిలాడు..

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో టిమ్ డేవిడ్ (102 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ల‌క్ష్యాన్ని ఆసీస్ 16.1 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే ఆసీస్ కైవ‌సం చేసుకుంది.