Axar Patel : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ దూరం? కోచ్ ఏమన్నాడంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు.
Will Axar Patel play in IPL 2026 clash against Sunrisers Hyderabad (pic credit@ipl)
- తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న అక్షర్ పటేల్
- ఆర్సీబీతో మ్యాచ్‌లో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్‌కు
- సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడేనా?
Axar Patel : ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది.
ఈ సీజన్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు +0.566గా ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఢిల్లీ 5 మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా +0.310 నెట్‌రన్‌రేటును కలిగి ఉంది.
Ayush Mhatre : చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్..
ఇరు జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికి కూడా మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక నేటి మ్యాచ్‌లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగు పరచుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అక్షర్ పటేల్ ఆడతాడా?
అక్షర్ పటేల్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఏప్రిల్ 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ రెండు సార్లు ఇబ్బంది పడ్డాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, స్టబ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో అక్షర్ మరోసారి మైదానంలోకి దిగే అవసరం రాలేదు.
అయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు ఆడతాడా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయం పై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ హేమంగ్ బదానీ స్పష్టత ఇచ్చాడు. అక్షర్ పటేల్ కోలుకున్నాడని వెల్లడించాడు. అతడు ఫిట్‌గానే ఉన్నాడని తెలిపాడు. దీంతో అక్షర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టత వచ్చింది. ఒకవేళ అతడు ఆడకుంటే మాత్రం ఢిల్లీకి అది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు
SRH vs DC : సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
ఇప్పటి వరకు అక్షర్ పటేల్ 5 ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లో 29 పరుగులు మాత్రమే సాధించాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతడు రాణించాలని ఢిల్లీ మేనేజ్మెంట్ కోరుకుంటోంది.
