Team India
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జోరు మీదుంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. కాగా.. ఈ మెగాటోర్నీలో వాంఖడేలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచులు గెలిచాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను 2011లో గెలిచింది. ఆ సందర్భంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టాస్ గెలిచాడు. దీంతో అతడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలవడంతో పాటు ఫైనల్‌లోనూ విజయం సాధించి కప్‌ను ముద్దాడింది.
Rohit Sharma : క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
2015, 2019లో ఏం జరిగిందంటే..?
2015, 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీ ఫైనల్ మ్యాచుల్లోనే ఇంటి ముఖం పట్టింది. ఈ రెండు మ్యాచుల్లో కూడా భారత్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ సారి అంటే 2023 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం శుభపరిణామం అని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సెమీ ఫైనల్ మ్యాచుల్లో టీమ్ఇండియా మొదటి సారి బ్యాటింగ్ చేస్తే విజయం సాధిస్తుందని, లక్ష్య ఛేదన అయితే ఓటమి తప్పదని అంటున్నారు. ఈ లెక్కన కివీస్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తుండడంతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని అంటున్నారు.
India in the World Cup Semi Finals:
2011 – India batted first, won the game.
2015 – India batted second, lost the game.
2019 – India batted second, lost the game.2023 – India batting first. pic.twitter.com/hbqPkkRgSc
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023
Venkatesh : మన వెంకీతో ఉన్న ఈ దిగ్గజ క్రికెటర్ ఎవరో మీకు తెలుసా..?