మిథాలీతో పాటు మెరవనున్న 16ఏళ్ల అనఘా.. ఎవరీమె?

మిథాలీతో పాటు మెరవనున్న 16ఏళ్ల అనఘా.. ఎవరీమె?

Updated On : October 12, 2020 / 2:49 PM IST

Women’s T20 Challenge లో చోటు దక్కించుకున్న అతి తక్కువ వయస్సున్న Cricketerలలో అనఘా మురళీ ఒకరు. టోర్నీలో వెలాసిటీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ, ఇంగ్లీష్ ప్లేయర్ డేనియల్ వాట్ తోకలిసి ఆడనుంది.

11ఏళ్ల వయస్సులోనే క్రీడల్లో ఎంటర్ అయిన అనఘా అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. హెరాన్స్ కోచింగ్ సెంటర్లో మురళీధర గైడెన్స్ లో రాటుదేలింది. రెండు వారాల రెగ్యూలర్ ట్రైనింగ్ తర్వాత కర్ణాటక అండర్-టీంలో చోటు దక్కించుకుంది.



సంవత్సరం తర్వాత కర్ణాటక అండర్-19జట్టులో చేరింది. అక్కడే అండర్-23స్థాయి ప్లేయర్ గా సత్తా సాధించింది. ఉమెన్స్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్, సీనియర్ కేఎస్సీఏ క్లబ్ లీగ్, సీనియర్ కర్ణాటక ప్రొబబుల్స్ లిస్టులో ఆడింది.

గతేడాది జరిగిన KSCA awards ఆఫ్ ద ఇయర్ లో ఉమెన్స్ అండర్-16, అండర్-19 టోర్నీల్లో అనఘా బెస్ట్ బౌలర్ అవార్డు అందుకుంది.

ఆమె తండ్రి మురళీ క్రికెట్ జర్నీని గుర్తు చేసుకుంటూ.. ‘మురళీధర టాలెంట్ ను ముందుగానే గుర్తించారు. అనఘా అండర్-16 జట్టుకు చోటు దక్కించుకుంటే మేం సర్‌ప్రైజ్ ఆశ్చర్యపోయాం. రెండు వారాలు మాత్రమే ట్రైనింగ్ అయింది. కానీ, మురళీధర చాలా కాన్ఫిడెంట్ గా ఉండటమే కాకుండా కరెక్ట్ గా ఊహించారు’ అని ఆమె తండ్రి మురళీ చెప్పుకొచ్చారు.

అనఘా మొదటి పీయూసీ స్టూడెంట్.. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ ఆడేందుకు మాత్రం కాస్త కంగారుపడుతుంది. ఆమెకు రవీంద్ర జడేజానే ఆదర్శమని.. మూడు టీంలతో, నాలుగు మ్యాచ్ ల టోర్నమెంట్ యూఏఈ వేదికగా నవంబరు 4నుంచి ఆరంభం కానుంది.