World Cup 2023 BAN vs AFG: మిరాజ్, నజ్ముల్ హాఫ్ సెంచరీలు.. ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ ఘన విజయం

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా శనివారం ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి.

World Cup 2023 BAN vs AFG: మిరాజ్, నజ్ముల్ హాఫ్ సెంచరీలు.. ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ ఘన విజయం

Bangladesh win (Photo Credit: @cricketworldcup)

Updated On : October 7, 2023 / 4:36 PM IST

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ బోణి కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ తో ధర్మశాల వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం అందుకుంది. 157 లక్ష్యాన్ని 34.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి చేరుకుంది. మెహిది హసన్ మిరాజ్ (57), నజ్ముల్ హుస్సేన్ శాంటో (59) అర్ధ సెంచరీలతో విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు బంగ్లా బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్ పని పట్టారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 37.2 ఓవర్లలోనే 156 పరుగులకు ఆలౌటయింది.

 

మిరాజ్ అవుట్.. మూడో వికెట్ డౌన్
124 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ నష్టపోయింది. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మెహిది హసన్ మిరాజ్ (57) అవుటయ్యాడు. 30 ఓవర్లలో 132/3 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

మెహిది హసన్ మిరాజ్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్ బ్యాటర్ మెహిది హసన్ మిరాజ్ హాఫ్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 4 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మిరాజ్ కు తోడుగా నజ్ముల్ హుస్సేన్ శాంటో (30) ఉన్నాడు. 25 ఓవర్లలో 106/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

నజ్ముల్, మిరాజ్ కీలక భాగస్వామ్యం.. కోలుకున్న బంగ్లాదేశ్
ఓపెనర్లు స్వల్ప స్కోరుకే అవుటయినా బంగ్లాదేశ్ కోలుకుంది. నజ్ముల్ హుస్సేన్ శాంటో(45), మెహిది హసన్ మిరాజ్(25) కీలక భాగస్వామంతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. 20 ఓవర్లలో 91/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (5), లిట్టన్ దాస్(13) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. 9 ఓవర్లలో 39/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

 

బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణ.. తక్కువ స్కోరుకే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ స్కోరుకే ఆలౌటయింది. బంగ్లాదేశ్ బౌలర్ల విజృంభణతో 37.2 ఓవర్లలో 156 పరుగులకు చాప చుట్టేసింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ 47 తప్ప ఎవరు రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, మెహిది హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. షోరీఫుల్ ఇస్లాం 2 వికెట్లు తీశాడు. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ కు షకీబ్ అల్ హసన్ దెబ్బ
ఆఫ్ఘనిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 126 పరుగులకే 6 వికెట్లు నష్టపోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. 34 ఓవర్లలో 150/6 స్కోరుతో ఆఫ్ఘనిస్తాన్ ఆట కొనసాగిస్తోంది.

బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ డౌన్
బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్ 47, ఇబ్రహీం జద్రాన్ 22, రహ్మత్ షా 18, హష్మతుల్లా షాహిదీ 18 పరుగులు చేసి అవుటయ్యారు. షకీబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు.

రహ్మత్ షా అవుట్.. రెండో వికెట్ డౌన్
83 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ రెండో వికెట్ నష్టపోయింది. రహ్మత్ షా 18 పరుగులు చేసి షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 20 ఓవర్లలో 96/2 స్కోరుతో ఆఫ్ఘనిస్తాన్ ఆట కొనసాగిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ 15 ఓవర్లలో 83/1
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిలకడగా ఆడుతోంది. 15 ఓవరల్లో వికెట్ నష్టపోయి 83 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్(36), రహ్మత్ షా(18) క్రీజ్ లో ఉన్నారు. ఇబ్రహీం జద్రాన్ 22 పరుగులు చేసి అవుటయ్యాడు.

హ్యపీగా ఉంది.. బాగా ఆడతా: రషీద్ ఖాన్
భారత్ లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో ఆడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ చెప్పాడు. ప్రపంచకప్‌లో పాల్గొనడం నాకు, జట్టుకు ప్రత్యేక సందర్భం. వన్డే వరల్డ్ కప్ భారతదేశంలో జరుగుతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మా జట్టు సమతూకంగా ఉంది. మా స్పిన్ బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. భారత్ లో విభిన్న పరిస్థితులు ఉంటాయి. ODI ప్రపంచ కప్‌లో అత్యుత్తమ జట్లు ఆడతాయి కాబట్టి మేము కూడా కష్టపడాల్సి ఉంటుంది. నేను కూడా బాగానే ఆడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. IPL, అంతర్జాతీయ క్రికెట్ ఆడాను కాబట్టి ఆ అనుభవం నాకు తోడ్పడుతుంది. మొత్తంగా మా జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోందని రషీద్ ఖాన్ తెలిపాడు.

ICC Cricket World Cup 2023 BAN vs AFG: వన్డే ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శనివారం జరుగుతున్న మూడో మ్యాచ్ లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రతిష్టాత్మక మెగా టోర్నిలో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు
బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిది హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫరూఖల్ హాక్