World Cup 2023 ENG vs SA: ఇంగ్లాండ్ పై ద‌క్షిణాప్రికా ఘ‌న విజ‌యం

వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. సౌతాఫ్రికా ఆ షాకు నుంచి కోలుకోవాలంటే ఈరోజు మ్యాచ్ లో విజయం తప్పనిసరి.

World Cup 2023 ENG vs SA: ఇంగ్లాండ్ పై ద‌క్షిణాప్రికా ఘ‌న విజ‌యం

England-vs-SouthAfrica

ద‌క్షిణాప్రికా ఘ‌న విజ‌యం

400 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 22 ఓవ‌ర్ల‌లో 170 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ర‌బాడ‌, కేశ‌వ్ మ‌హ‌రాజ్ ఒక్కొ వికెట్ తీశారు.

20 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 135/8
ఇంగ్లాండ్ జ‌ట్టు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తోంది. 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇంగ్లాండ్ స్కోరు 135/8. మార్క్ వుడ్ (26), అట్కిన్సన్ (17) లు ఆడుతున్నారు.

ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు..
ఇంగ్లాండ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. గెరాల్డ్ కోయెట్జీ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. మొద‌టి బంతికి జోస్ బ‌ట్ల‌ర్ (15; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), మూడో బంతికి హ్యారీ బ్రూక్ (17; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 68 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 12 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 70/6. ఆదిల్ ర‌షీద్ (0), డేవిడ్ విల్లీ (2) లు ఆడుతున్నారు.

స్టోక్స్ విఫ‌లం
ఇంగ్లాండ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న స్టోక్స్ (5) విఫ‌లం అయ్యాడు. ర‌బాడ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 9 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 50/4. హ్యారీ బ్రూక్ (16), జోస్ బ‌ట్ల‌ర్ (1)లు ఆడుతున్నారు.

డేవిడ్ మ‌ల‌న్ ఔట్‌
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్వింట‌న్ డికాక్ క్యాచ్ అందుకోవ‌డంతో డేవిడ్ మ‌ల‌న్ (6) ఔట్ అయ్యాడు. దీంతో 5.1వ ఓవ‌ర్‌లో 24 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది.

రూట్ ఔట్‌
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో జో రూట్‌(2) మిల్ల‌ర్ చేతికి చిక్కాడు. 5 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 24/2. డేవిడ్ మ‌ల‌న్ (6), బెన్‌స్టోక్స్ (0) లు ఆడుతున్నారు.

బెయిర్ స్టో ఔట్‌
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ జానీ బెయిర్ స్టో (10; 12 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) ఎంగిడి బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో 2.3వ ఓవ‌ర్‌లో 18 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఇంగ్లాండ్ టార్గెట్ 400
మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ (109; 67 బంతుల్లో 12 ఫోర్లు, 4సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 399 ప‌రుగులు చేసింది. రీజా హెండ్రిక్స్(85; 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), మార్కో జాన్సెన్ (75 నాటౌట్ ; 42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (60; 61 బంతుల్లో 8 ఫోర్లు), హాఫ్ సెంచ‌రీలు చేశారు. మార్‌క్ర‌మ్ (42), రాణించ‌డంతో ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది. ఇంగ్లాండ్ బౌల‌ర‌ల్లో రీస్ టాప్లీ మూడు వికెట్లు తీశాడు. ఆదిల్ ర‌షీద్, అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.

61 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన క్లాసెన్‌
మార్క్‌వుడ్ బౌలింగ్‌లో (46.4వ ఓవ‌ర్‌) ఫోర్ కొట్టిన క్లాసెన్ 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో శ‌త‌కాన్ని అందుకున్నాడు.

 

క్లాసెన్ హాఫ్ సెంచ‌రీ..
టాప్లీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 40 బంతుల్లో క్లాసెన్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 42 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 275/5. క్లాసెన్ (58), మార్కో జాన్సెన్ (12)లు ఆడుతున్నారు.

మిల్ల‌ర్‌ ఔట్‌..
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. రీస్ టాప్లీ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌ క్యాచ్ అందుకోవ‌డంతో డేవిడ్ మిల్ల‌ర్ (5) ఔట్ అయ్యాడు. దీంతో 36.3వ ఓవ‌ర్‌లో 243 పరుగుల వ‌ద్ద సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.

మార్‌క్ర‌మ్ ఔట్‌..
రీస్ టాప్లీ బౌలింగ్‌లో బెయిర్ స్టో క్యాచ్ అందుకోవ‌డంతో మార్‌క్ర‌మ్ (42; 44 బంతుల్లో 4ఫోర్లు) ఔట్ అయ్యాడు. 35 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 233/4.

హెండ్రిక్స్ సెంచ‌రీ మిస్‌..
ద‌క్షిణాప్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో రీజా హెండ్రిక్స్ (85; 75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 25.2వ ఓవ‌ర్‌లో 164 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.

డస్సెన్ ఔట్‌..
ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (60; 61 బంతుల్లో 8 ఫోర్లు) బెయిర్ స్టో క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 19.4వ ఓవ‌ర్‌లో 125 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది.

హెండ్రిక్స్, డస్సెన్ లు హాఫ్ సెంచ‌రీలు..
నాలుగు ప‌రుగుల‌కే వికెట్ కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను హెండ్రిక్స్, డస్సెన్ లు ఆదుకున్నారు. డుస్సెన్ 49 బంతుల్లో, హెండ్రిక్స్ 48 బంతుల్లో అర్థ‌శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు. వీరిద్ద‌రి భాగ‌స్వామ్యం వంద ప‌రుగులు దాటింది. 17 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 107/1. రీజా హెండ్రిక్స్(50), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (51) లు ఆడుతున్నారు.

 

10 ఓవ‌ర్ల‌కు దక్షిణాఫ్రికా స్కోరు 59/1
సూప‌ర్ ఫామ్‌లో ఉన్న క్వింట‌న్ డికాక్ త్వ‌ర‌గానే ఔటైన‌ప్ప‌టికీ రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు దక్షిణాఫ్రికా స్కోరు 59/1.రీజా హెండ్రిక్స్(25), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (28) లు ఆడుతున్నారు.

సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా రెగుల్యర్ బావుమా అనారోగ్యం కారణంగా ఈరోజు మ్యాచ్ లో ఆడటం లేదు. ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బావుమా ప్లేస్ లో రీజా హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు.

 

తుది జట్లు
దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, లుంగీ ఎన్గిడి

ఇంగ్లాండ్ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

బరిలోకి బెన్ స్టోక్స్
ENG vs SA: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మరో కీలక సమరానికి తెర లేచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క విజయం మాత్రమే అందుకుంది. పాయింట్ల పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్ లో గెలిచి ముందుకెళ్లాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తోంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈరోజు బరిలోకి దిగనున్నాడు.

మరోవైపు తాము ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా మూడో మ్యాచ్ లో అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో భంగపాటుకు గురైంది. ఆ షాకు నుంచి కోలుకోవాలంటే ఈరోజు మ్యాచ్ లో విజయం తప్పనిసరి.