Ravindra Jadeja : క్యాచ్ మిస్ చేసిన జడేజా.. అతడి భార్య రియాక్షన్ వైరల్..
రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా మిస్ చేశాడు.

Ravindra Jadeja-Rivaba Jadeja
Ravindra Jadeja-Rivaba Jadeja : వన్డే ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ధర్మశాల వేదికగా మ్యాచ్ జరుగుతోంది. హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌లు దూరం కావడంతో వారి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలు భారత తుది జట్టులోకి వచ్చారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ మొదట బ్యాటింగ్ చేస్తోంది.
బ్యాటింగ్ ఆరంభించిన కివీస్‌కు ఆదిలోనే భారత బౌలర్లు గట్టి షాకులు ఇచ్చారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో డేవాన్ క్వానేను సిరాజ్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చగా తొమ్మిదో ఓవర్‌లో విల్‌యంగ్‌ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. దీంతో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ఈ దశలో మరో వికెట్ పడితే కివీస్ కష్టాల్లో పడేది. అయితే.. ఈ అవకాశాన్ని జడేజా చేజార్చాడు. ఇన్నింగ్స్ 11 ఓవర్ ను షమీ వేయగా ఐదో బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఉన్న జడేజా మిస్ చేశాడు.
Mohammed Shami : ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అరుదైన ఘనత..
View this post on Instagram
జడేజా క్యాచ్ మిస్ చేసిన సమయంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న అతడి భార్య రివాబా జడేజా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. తనకు లభించిన అవకాశాన్ని రచిన్ రవీంద్ర పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. 12 పరుగుల వద్ద వచ్చిన జీవనధానాన్ని ఉపయోగించుకుని 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. డారిల్ మిచెల్ తో కలిసి తన జట్టుకు మంచి స్కోరు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. 23 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 110/2. డారిల్ మిచెల్ (38), రచిన్ రవీంద్ర (50) లు ఆడుతున్నారు.
Virat Kohli : వ్యాఖ్యాత పొరబాటు.. సరిద్దిన కోహ్లీ.. వీడియో వైరల్..
Reaction of Rivaba Jadeja on Ravindra Jadeja’s drop catch. pic.twitter.com/9cLQxaVz8C
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2023