Who Is Rachin Ravindra : ర‌చిన్ ర‌వీంద్ర ఎవ‌రు..? స‌చిన్‌, రాహుల్ ద్ర‌విడ్‌ల‌తో ఉన్న సంబంధం ఏంటి..?

ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచులో అజేయ శ‌త‌కంతో త‌న జ‌ట్టును గెలిపించాడు.

Who Is Rachin Ravindra : ర‌చిన్ ర‌వీంద్ర ఎవ‌రు..? స‌చిన్‌, రాహుల్ ద్ర‌విడ్‌ల‌తో ఉన్న సంబంధం ఏంటి..?

Rachin Ravindra

Rachin Ravindra : ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచులో అజేయ శ‌త‌కంతో త‌న జ‌ట్టును గెలిపించాడు. ఈ క్ర‌మంలో వ‌న్డే ప్రపంచకప్‌ చరిత్రలో కివీస్‌ తరఫున సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదండోయ్ బౌలింగ్‌లో కీల‌క‌మైన హ్యారీ బ్రూక్ వికెట్‌ను సైతం ప‌డ‌గొట్టాడు.

రాహుల్‌ ద్రవిడ్‌లో ‘ర’.. సచిన్‌లో ‘చిన్‌’ కలిస్తే ‘రచిన్‌ రవీంద్ర..

ర‌చిన్‌ రవీంద్ర పేరు చూస్తే మనకి చాలా దగ్గరగా ఉన్న‌ట్లు అనిపిస్తుందా గ‌దా..? అవును.. క‌రెక్టే కానీ.. ర‌చిన్ ర‌వీంద్ర పుట్టిక ముందే అత‌డి కుటుంబ న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిర‌ప‌డింది. అత‌డి తండ్రి రవి కృష్ణమూర్తి బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా పనిచేసేవాడు. అయితే.. న్యూజిలాండ్ వెళ్లిన రవి కృష్ణమూర్తి అక్కడ హట్‌ హాక్స్‌ పేరుతో క్రికెట్‌ క్లబ్‌ను ప్రారంభించాడు. మధ్య మధ్యలో కృష్ణమూర్తి బెంగుళూరు వచ్చి క్రికెట్ ఆడేవాడు.

న‌వంబ‌ర్ 18, 1999లో రచిన్ ర‌వీంద్ర జ‌న్మించాడు. రవికృష్ణమూర్తికి టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్లు అయిన‌ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌ అంటే విపరీతమైన ఇష్టం కావ‌డంతో.. వారి ఇద్ద‌రి పేర్లు కలిసి వచ్చేలా రచిన్‌ రవీంద్ర అని త‌న కుమారుడికి పేరు పెట్టుకున్నాడు.

ODI World Cup 2023 : క్రికెట్ లవర్స్‌కు పండుగే.. సరికొత్త ఫీచర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచ కప్‌ 2023 స్ట్రీమింగ్ ఇలా చూడొచ్చు!

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం..

2016, 2018లో న్యూజిలాండ్‌ తరఫున అండర్‌ 19 ప్రపంచ కప్‌లు ఆడాడు రచిన్ రవీంద్ర. 2018-19లో సీజన్లో వెల్లింగ్టన్‌ తరఫున ఆడాడు. అదే సీజన్లో లిస్ట్‌-ఏ క్రికెట్లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. ఫోర్డ్‌ ట్రోఫీలో లిస్ట్‌-ఏలో మొద‌టి శతకం బాదాడు. ప్లంకెట్‌ షీల్డ్‌లో ఫస్ట్‌క్లాస్‌ శతకం సాధించాడు. ఈ క్ర‌మంలో 2021 సెప్టెంబ‌ర్‌లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన టీ20 మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఐసీసీ తొలిసారి నిర్వ‌హించిన ప్ర‌పంచ‌టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌కు ఎంపికైనా స‌రే తుది జ‌ట్టులో అత‌డికి చోటు ద‌క్క‌లేదు. 2021లో టెస్టుల్లో 2023లో వ‌న్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వీంద్ర 13 వ‌న్డేలు, 18 టీ20లు, 3 టెస్టులు ఆడాడు.

ప్ర‌తీకారం తీర్చుకున్న కివీస్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 282 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర‌లో జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ల‌క్ష్యాన్ని న్యూజిలాండ్ 36.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్స‌ర్లు), రచిన్ రవీంద్ర (123 నాటౌట్; 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో రాణించారు.

Virat Kohli : అడగకముందే అందిన వరం.. అభిమాని వద్దకు వచ్చి కోహ్లీ ఏం చేశాడో తెలుసా..?