World Rapid Chess Championships: వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భరతకోటి హ్యాట్రిక్ విక్టరీ
తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ తొలి రోజు...

Chess
World Rapid Chess Championships: తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ తొలి రోజు తనకంటే ఎంతో మెరుగైన రేటింగ్ ఉన్న గ్రాండ్‌మాస్టర్లతో ఆడి మూడు గేముల్లోనూ విజయం సాధించాడు. 3 పాయింట్లతో మరో 9మందితో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు ఈ హైదరాబాద్ ప్లేయర్.
ప్రస్తుతం 2484 రేటింగ్ ఉన్న హర్ష తొలి గేమ్‌లో 51 ఎత్తుల్లో రవూఫ్ మమెదోవ్ (అజర్ బైజాన్–2690)పై… రెండో గేమ్‌లో 54 ఎత్తుల్లో వ్లాదిస్లావ్ కొవలెవ్ (రష్యా– 2647)పై మూడో గేమ్‌లో 56 ఎత్తుల్లో ఒనిష్‌చుక్ (ఉక్రెయిన్ –2687)పై గెలుపొందాడు.
తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ రెండు గేముల్లో గెలిచి మరో గేమ్‌ను ‘డ్రా’ ముగించాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కోనేరు హంపి తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని జైనాబ్ (అజర్‌బైజాన్)తో జరిగిన మూడో గేమ్‌లో ఓటమి చవిచూసింది.