WTC Final : గెలిచేదెవరు? ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరికొన్ని గంటలే మిగిలుంది. సైలెంట్‌ కిల్లర్‌ కివిస్‌ను ఢీకొట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్‌సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంలో కివీస్‌, గతంలో ఆసీస్‌ను సొంతగడ్డపైనే ఓడించిన ధీమాలో భారత్‌... రెండు సమఉజ్జీల మధ్య జరుగుతున్న పోరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది.

WTC Final : గెలిచేదెవరు? ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌

Wtc Final

Updated On : June 17, 2021 / 2:21 PM IST

India v New Zealand : ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు మరికొన్ని గంటలే మిగిలుంది. సైలెంట్‌ కిల్లర్‌ కివిస్‌ను ఢీకొట్టేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టెస్ట్‌సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంలో కివీస్‌, గతంలో ఆసీస్‌ను సొంతగడ్డపైనే ఓడించిన ధీమాలో భారత్‌… రెండు సమఉజ్జీల మధ్య జరుగుతున్న పోరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. సౌథాంప్టన్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఇరుజట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. టెస్ట్‌ క్రికెట్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి.

బ్యాటింగ్..బౌలింగ్ విభాగంలో భారత్ బలం :-

భారత్‌ బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ కోహ్లీ, హిట్‌మెన్ రోహిత్, గిల్‌, పుజారా, రహానే, పంత్‌, విహారిలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడితే బ్యాట్స్‌మెన్‌కు తిరుగుండదు. అలాగే షమి, బుమ్రా, ఇషాంత్, సిరాజ్‌లతో బౌలింగ్‌ విభాగం కూడా గట్టిగానే కనిపిస్తోంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు కూడా జట్టులో ఉన్నారు. అయితే కెప్టెన్ కోహ్లీ ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల వ్యూహం ఎంచుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ నలుగురు ఫాస్ట్‌బౌలర్లను ఎంచుకుంటే బ్యాటింగ్‌కూడా చేయగల జడేజావైపే మొగ్గు చూపొచ్చు.

కివీస్ బలబలాలు :-

కివీస్‌కూడా బలంగానే కనిపిస్తోంది. బౌలింగే ఆ జట్టు ప్రధాన ఆయుధం. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో పరిస్థితులు న్యూజిలాండ్‌ను పోలి ఉండటం ఆ జట్టుకు కలసి వచ్చే అంశం. బౌల్ట్, సాథీతో పాటు వాగ్నర్‌, జెమీసన్‌, హెన్రీ, గ్రాండ్‌హోమ్‌లతో ఆ జట్టు పేస్‌ విభాగం చాలా బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనే స్వింగ్ సాధించగల బౌలర్లు ఆ జట్టుకు ఉన్నారు. కాస్త వర్షం పడ్డా, మబ్బులుపట్టి ఉన్నా కివీస్ బౌలర్లను ఆపడం కష్టమే. ఇక కెప్టెన్‌ విలియమ్‌సన్‌, రాస్‌టేలర్‌, టామ్‌లేథమ్‌లతో ఆ బట్టు బ్యాటింగ్‌ కూడా పటిష్ఠంగానే ఉంది. కొత్త ఓపెనర్‌ కాన్వే దూకుడు మీదున్నాడు. నికోల్స్, వాట్లింగ్‌, బ్లండెల్‌లను తక్కువ అంచనా వేయలేం. ఫీల్డింగ్‌లోనూ కివీస్‌దే పైచేయి.

వాతావరణం : –

ఇరుజట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నా వాతావరణం, బౌలింగ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే మొగ్గు కాస్త కివీస్‌వైపే కనిపిస్తోంది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడటంతో కివీస్‌కు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. పైగా ఇంగ్లండ్‌పై గెలవడంతో ఆ జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పైగా భారత్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా బరిలోకి దిగుతోంది.