WPL 2024 Full Schedule : ఫిబ్రవరి 23 నుంచే మహిళల ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీ.. ఫుల్ షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, జట్ల పూర్తి వివరాలివే
WPL 2024 Full Schedule : డబ్ల్యూపీఎల్ 2024 రెండో సీజన్‌లో భాగంగా ఫిబ్రవరి 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

WPL 2024 : Squads, schedule, live streaming and everything you need to know
WPL 2024 Full Schedule : డబ్ల్యూపీఎల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ (WPL 2024 ) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మహిళల టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్ టోర్నీ గురించి గత జనవరి 24న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వెల్లడించింది. అయితే, షెడ్యూల్ ప్రకారం.. ఈ మహిళల టీ20 ఛాంపియన్‌షిప్ ఈవెంట్ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 17న ముగుస్తుంది.
ఈ టోర్నీలో మొత్తం 22 గేమ్‌లు, 20 రెగ్యులర్ సీజన్ మ్యాచ్‌లు, ఒక ఎలిమినేటర్, ఒక ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో మొత్తం 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తరువాత, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ రౌండ్ స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు నేరుగా బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో పోటీపడతాయి.
Read Also : కోటి రూపాయలు, బీఎండబ్ల్యూ కారు.. హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ బంపర్ ఆఫర్
- డబ్ల్యూపీఎల్ 2024 ఫార్మాట్‌లో ఎలాంటి మార్పు లేదు.
- మొత్తం ఐదు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడతాయి .
- డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
- రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.
- ఎలిమినేటర్ విజేత టేబుల్ టాపర్లతో గ్రాండ్ ఫినాలేలో తలపడతారు.
మ్యాచ్ సమయాలు, లైవ్ చూడాలంటే? :
భారత ప్రామాణిక కాలమానం ప్రకారం.. అన్ని టీ20 మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టాస్ మాత్రం రాత్రి 7 గంటలకు పడుతుంది. ఇక, క్రికెట్ అభిమానులు ‘స్పోర్ట్స్ 18’ నెట్‍వర్క్ ఛానెళ్లు, జియోసినిమాస్‌లో డబ్యూపీఎల్ 2024 మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించవచ్చు.
?Bengaluru
The @UPWarriorz are ? and raring to go for #TATAWPL Season 2 ? pic.twitter.com/ZtHaGpKdEr
— Women’s Premier League (WPL) (@wplt20) February 20, 2024
డబ్ల్యూపీఎల్ 2024 వేదికలివే :
- ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
- అరుణ్ జైట్లీ సాడియం, ఢిల్లీ
ఢిల్లీ, బెంగళూరు మధ్య ప్రారంభ మ్యాచ్ :
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మార్చి 4 వరకు మొదటి 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (మార్చి 15న ఎలిమినేటర్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ సహా మిగిలినవి) వేదిక కానుంది.
అయితే, ప్రారంభ మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్ మహిళల జట్టు బెంగళూరులో గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ ఏడాదిలో (WOPL 2024) టైటిల్ కోసం పోటీపడుతున్న మహిళల క్రికెట్ జట్లలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూపీ వారియర్జ్ ఉన్నాయి.
4⃣ days to go for #TATAWPL 2024 ?
Which player best describes your excitement for Season 2? ? pic.twitter.com/6pIaLIkb1b
— Women’s Premier League (WPL) (@wplt20) February 19, 2024
WPL 2024 జట్ల వివరాలు :
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టైటిల్ కోసం పోటీ పడేందుకు ఐదు డైనమిక్ టీమ్‌లతో సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్జ్ జట్లు అంతర్జాతీయ స్టార్‌లతో తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతి జట్టులో ఆల్-రౌండర్లు, బ్యాటర్లు, బౌలర్లు, వికెట్ కీపర్‌లు కొత్త ఉత్సాహంతో టోర్నమెంట్‌లో పోటీపడేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
డబ్ల్యూపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ వివరాలివే :
మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్ (WPL 2024) సీజన్‌కు సంబంధించిన తేదీలు, మ్యాచ్‌లు, వేదికలతో సహా అన్ని మ్యాచ్‌ల వివరాలతో పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
- ఫిబ్రవరి 23- బెంగళూరులో ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- ఫిబ్రవరి 24- బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్
- ఫిబ్రవరి 25- బెంగళూరులో గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
- ఫిబ్రవరి 26 – బెంగళూరులో UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- ఫిబ్రవరి 27 – బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
- ఫిబ్రవరి 28 – బెంగళూరులో ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్
- ఫిబ్రవరి 29 – బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
- మార్చి 1 – బెంగళూరులో UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్
- మార్చి 2 – బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్
- మార్చి 3 – బెంగళూరులో గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
- మార్చి 4 – బెంగళూరులో UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 5 – ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
- మార్చి 6 – ఢిల్లీలో గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 7 – ఢిల్లీలో UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్
- మార్చి 8 – ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్
- మార్చి 9 – ఢిల్లీలో ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
- మార్చి 10 – ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 11 – ఢిల్లీలో గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్
- మార్చి 12 – ఢిల్లీలో ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- మార్చి 13 – ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
- మార్చి 15 – ఢిల్లీలో ఎలిమినేటర్
- మార్చి 17 – ఢిల్లీలో ఫైనల్
Read Also :IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా? ఎన్నికలున్నప్పటికీ భారత్‌లోనే మ్యాచులా?