IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా? ఎన్నికలున్నప్పటికీ భారత్‌లోనే మ్యాచులా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గుడ్‌న్యూస్ చెప్పారు.

IPL
Fact Check: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గుడ్‌న్యూస్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ భారత్‌లోనే ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఐపీఎల్-2024 (17వ సీజన్) వచ్చే నెల 22 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.
చెన్నైలోనే మొదటి మ్యాచ్ ఉంటుందని చెప్పారు. ఈ మేరకు బీసీసీఐ ప్రణాళికలు వేసుకుంటోందని తెలిపారు. ఐపీఎల్ మ్యాచులకు సంబంధించి త్వరలోనే ప్రాథమిక షెడ్యూల్ విడుదల అవుతుందని చెప్పారు. రెండు దశలుగా షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.
మొదటి దశలో తొలి 15 రోజుల మ్యాచ్‍ల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో మూడు వారాల్లో ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ షెడ్యూల్‍ను బట్టి మిగతా ఐపీఎల్ మ్యాచ్‍ల తేదీల గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులో చెన్నై గెలిచింది. ఆ రెండు జట్లే ఈ సారి తొలి మ్యాచ్ ఆడతాయి. కాగా, దేశంలో ఎన్నికలపై ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఐపీఎల్‌ను ఈ సారి విదేశాల్లో నిర్వహిస్తారని అందరూ భావించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయినా విడుదలైందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని అరుణ్ ధుమాల్ చెప్పడంతో దీనిపై స్పష్టతవచ్చినట్లయింది.
కోటి రూపాయలు, బీఎండబ్ల్యూ కారు.. హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ బంపర్ ఆఫర్