Wrestler Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు....

Wrestler Vinesh Phogat
Wrestler Vinesh Phogat : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వినేష్ ఫోగట్ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేయడానికి ముందు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వినేష్ ఫోగట్ తనకు వచ్చిన ఖేల్ రత్న, అర్జున అవార్డులను తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు.
ALSO READ : Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక
మల్లయోధులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ బాడీకి నిరసనగా సాక్షీ మాలిక్ రిటైర్ మెంట్ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై వదిలిపెట్టారు. మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసం నుంచే డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయం కూడా పనిచేస్తోందని ప్రభుత్వంపై వినేష్ తీవ్ర పదజాలంతో కూడిన ప్రకటనలో పేర్కొంది.
ALSO READ : Ram Temple in Ayodhya : పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలిచిన కొన్ని గంటల తర్వాత, ఒలింపిక్ పతక విజేతలైన సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో కలిసి వినేష్ ఫోగట్ న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. గతంలో తమను అణగదొక్కిన వారి చేతుల్లోకి మళ్లీ అధికారం వచ్చిందని మల్లయోధులు ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ : Covid guidelines : మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్…ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు
मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।
इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद ? pic.twitter.com/KlhJzDPu9D
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023