Vishal Kaliraman: ఇంతగా కష్టపడ్డాం.. ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేశాం.. అంతా వృథా: రెజ్లర్ విశాల్
ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారే ఆసియన్ గేమ్స్ కు వెళ్లాలని అన్నాడు.

Vishal Kaliraman
Vishal Kaliraman -Wrestlers : భారత రెజ్లర్ విశాల్ కాళీరామన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంతో కష్టపడ్డానని, అయినప్పటికీ అది వృథా అవుతోందని చెప్పాడు. రెజ్లర్లు భజరంగ్ పునియా(Bajrang Punia), వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ఇద్దరూ ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఆసియన్ గేమ్స్ (Asian Games 2023) లో పాల్గొనే అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులపై భజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ పోరాటం చేసిన నేపథ్యంలో ట్రయల్స్ కు దూరమయ్యారు. దీంతో ట్రయల్స్ నుంచి వారిద్దరికీ మినహాయింపు దక్కింది. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి చైనాలో జరగనున్న ఆసియన్ గేమ్స్ కు నేరుగా వెళ్లనున్నారు.
దీనిపై పలువురు రెజ్లర్లు నిరసన గళం వినిపిస్తున్నారు. ఇవాళ రెజ్లర్ విశాల్ కాళీరామన్ మీడియాతో మాట్లాడుతూ… ” ప్రతి క్రీడాకారులు ట్రయల్స్ లో పాల్గొనవలసిందే. ఎన్నో ఏళ్లు కష్టపడి సాధన చేసినప్పటికీ నాకు ఆసియన్ గేమ్స్ లో పాల్గొనే అవకాశం రాలేదు. భజరంగ్ పునియా ఇక్కడకు వచ్చి ట్రయల్స్ లో పాల్గొనాలి. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారే ఆసియన్ గేమ్స్ కు వెళ్లాలి.. పతకం సాధించాలి ” అని వాపోయాడు. ట్రయల్స్ లో గెలిచినా వెళ్లలేకపోతున్నానని చెప్పాడు. భజరంగ్ పునియాకు స్టాండ్ బైగా విశాల్ ఉన్నాడు.
మరోవైపు, రెజ్లర్ దీపక్ పునియా మాట్లాడుతూ.. ” ఏసియన్ గేమ్స్ వెళ్లడానికి ఇవాళ నన్ను ఎంపిక చేశారు. ఏసియన్ గేమ్స్ లో గెలవడానికి సాధన చేశాను. ఈ ఏడాది రెండు బిగ్ ఈవెంట్లు ఉన్నాయి. మొదటిది ప్రపంచ ఛాంపియన్‌షిప్, రెండోది ఆసియన్ గేమ్స్ ” అని అన్నాడు.
Wrestlers: ఆసియన్స్ గేమ్స్‌కు భజరంగ్, వినేశ్ ఫొగట్.. పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు