జీవితాంతం ఐపీఎల్లో ఆర్సీబీకే ఆడతా- చాహల్

ఐపీఎల్ సీజన్ 12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనకు సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా చెన్నైపై విజయాన్ని అందుకున్న క్షణం నుంచి ఆర్సీబీపై ప్రభావం మారిపోయింది. ప్లేయర్లు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. బెంగళూరు ప్లేయర్ అయిన చాహల్.. తమ జట్టు పట్ల విశ్వాసాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నాడు. 

‘ఇది ఒక కుటుంబం లాంటిది. 2014 నుంచి ఆర్సీబీ తరపున ఆడా. బెంగళూరు వచ్చి ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడటం చాలా సంతోషంగా అనిపించింది. జీవితాంతం నా ఐపీఎల్ కెరీర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకే ఆడతా’ అని చాహల్ చెప్పుకొచ్చాడు. 
Also Read : CSKvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

మా సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఆడినప్పుడు అభిమానుల నుంచి ప్రోత్సాహం భారీగా అందుతుంది. కానీ, నేను బౌలింగ్ వేసేటప్పుడు మాత్రం ఆటపైనే దృష్టిపెడతా. ఎక్కడ బౌలింగ్ వేయాలా అనే విషయంలో క్లియర్‌గా ఉంటా. ఇది నాకు కొత్తేం కాదు’ అని చాహల్ వెల్లడించాడు. 

జట్టుకు వరుస వైఫల్యాలు ఎదురవుతున్నంత సమయంలోనూ చాహల్ జట్టు పట్ల విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంకా పూర్తిగా అవకాశాలు చేజారిపోలేదని, తాము ప్లే ఆఫ్‌కు వెళ్లగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్‌ను చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 24న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడనుంది. 
Also Read : సచిన్, అజిత్‌‌లకు పోలిక భలే కుదిరిందే!