Samsung Galaxy S25 Ultra : 2025లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా ఖతర్నాక్ ఫీచర్లతో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S 25 అల్ట్రా కన్నా బెటర్ ఫీచర్లతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ ఏదైనా కొనేసుకోండి.

1/7Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? 2025లో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో నుంచి గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్, వన్‌ప్లస్ 15, ఒప్పో ఫైండ్ X9 ప్రో వరకు అనేక బ్రాండ్‌లు ఫొటోగ్రఫీ, పర్ఫార్మెన్స్, డిస్‌ప్లే ఆప్షన్లు కలిగి ఉంది.
2/7Samsung Galaxy S25 Ultra
ఈ ఏడాదిలో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌కు మించిన ఫీచర్లతో 5 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందులో ఐఫోన్ 17 ప్రో, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, వన్‌ప్లస్ 15, వివో X300 ప్రో, వివో X300 ప్రో, ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు.
3/7iPhone 17 Pro
ఐఫోన్ 17 ప్రో (రూ. 1,31,999) : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 6.3 అంగుళాల ఎల్‌టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. 4x ఆప్టికల్ జూమ్, అడ్వాన్స్ LiDAR డెప్త్ సెన్సింగ్, 8K డాల్బీ విజన్ రికార్డింగ్‌తో ట్రిపుల్ 48MP బ్యాక్ కెమెరాలతో మొబైల్ ఫొటోగ్రఫీని ప్రో లెవల్ అందిస్తుంది. A19 ప్రో చిప్ సపోర్టుతో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా విలువైన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పొచ్చు.
4/7Google Pixel 10 Pro XL
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL (రూ. 1,24,999) : గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL ఫోన్ క్లీన్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ, 48MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ కలిగి ఉంది. 42MP ఫ్రంట్ కెమెరా షార్ప్ 4K వీడియోకు సపోర్టు ఇస్తుంది. 6.8 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ 120Hz డిస్‌ప్లే, టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇమేజింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కన్నా అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది.
5/7OnePlus 15
వన్‌ప్లస్ 15 (రూ. 72,999) : వన్‌ప్లస్ 15 ఫోన్ ట్రిపుల్ 50MP లెన్స్ సెటప్‌తో ఆకట్టుకునే కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కన్నా సరసమైన ధరలో కొనుగోలు చేయొచ్చు.
6/7Vivo X300 Pro
వివో X300 ప్రో (రూ. 1,09,999) : వివో X300 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్‌తో 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డైమెన్సిటీ 9500 చిప్‌తో ఆధారితమైనది. 16GB వరకు ర్యామ్, ప్లస్ డ్యూయల్ UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. అద్భుతమైన కెమెరాలలో 50MP మెయిన్ సెన్సార్, భారీ 200MP పెరిస్కోప్ టెలిఫోటో, జీసెస్ ట్యూనింగ్ 8K వీడియోతో కూడిన 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 6510mAh బ్యాటరీ ప్రీమియం డిజైన్‌తో 2025లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కన్నా బెటర్ ఆప్షన్లను అందిస్తుంది.
7/7Oppo Find X9 Pro
ఒప్పో ఫైండ్ X9 ప్రో (రూ. 72,999) : ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ 3600నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందించే 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 16GB వరకు ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో డైమెన్సిటీ 9500 చిప్‌పై రన్ అవుతుంది. కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ లెన్స్, 200MP పెరిస్కోప్ టెలిఫొటో, హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్, 10 బిట్ వీడియోతో 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. భారీ 7500mAh బ్యాటరీ, ప్రీమియం బిల్డ్‌తో సపోర్టు అందిస్తుంది. 2025లో టాప్ శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్లలో ఒకటిగా చెప్పొచ్చు.