5 WhatsApp Features : వాట్సాప్‌లో అతి త్వరలో 5 సరికొత్త ఫీచర్లు.. వాట్సాప్ ప్రీమియం ప్లాన్, ఎడిట్ టూల్ మరెన్నో ఫీచర్లు..

5 WhatsApp Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపర్చేందుకు WhatsApp కొత్త అప్‌డేట్‌లను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్ అప్‌డేట్‌లపై పని చేస్తోంది.

5 WhatsApp Features : వాట్సాప్‌లో అతి త్వరలో 5 సరికొత్త ఫీచర్లు.. వాట్సాప్ ప్రీమియం ప్లాన్, ఎడిట్ టూల్ మరెన్నో ఫీచర్లు..

5 WhatsApp features launching very soon WhatsApp Premium plan, new edit tool and more

Updated On : October 17, 2022 / 5:13 PM IST

5 WhatsApp Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపర్చేందుకు WhatsApp కొత్త అప్‌డేట్‌లను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్ అప్‌డేట్‌లపై పని చేస్తోంది. ప్రస్తుత గ్రూప్ చాట్ (Group Chat) పార్టిసిపెంట్స్ లిమిట్ పెంచుతోంది. ఇమేజ్‌లు లేదా వీడియోల కోసం స్క్రీన్‌షాట్‌లను లిమిట్ చేస్తుంది, క్యాప్షన్‌లతో డాక్యుమెంట్‌లను షేర్ చేయడం మరెన్నో ఫీచర్లను అందిస్తోంది. వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం ఎంపిక చేసిన ప్లాన్‌లలో ప్రీమియం ఫీచర్లను అందించేందుకు వాట్సాప్ ప్రీమియం ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్న వాట్సాప్ ఫీచర్లలో కొన్నింటిని నిశితంగా పరిశీలిద్దాం. ఈ ఫీచర్‌లు ప్రస్తుతం బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

1. Edit messages after sending :
వాట్సాప్ ఇప్పుడు యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన కొద్ది నిమిషాల్లోపే ఆయా మెసేజ్‌లను ఎడిటింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. WabetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp ప్రస్తుతం Twitter మాదిరిగానే కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. దీనివల్ల యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేసేందుకు వీలుంది. కొత్త ఫీచర్ ఎడిట్ చేసిన మెసేజ్‌ల కోసం చాట్ బబుల్‌లో ‘Edited Lable’ని కూడా చూపిస్తుంది. ఎడిటెడ్ మెసేజ్ మళ్లీ ఎడిట్ చేయొచ్చు లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో బీటా టెస్టింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

2. WhatsApp group participants limit to 1024 :
వాట్సాప్ మళ్లీ పార్టిసిపెంట్ల లిమిట్ పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం.. యూజర్ల లిమిట్ 512 మంది సభ్యులకు సెట్ చేసింది. కానీ, త్వరలో మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్లను ఒకే గ్రూపులో 1,024 మంది సభ్యులను యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఆండ్రాయిడ్, iOS వాట్సాప్ బీటా టెస్టర్‌ల ఎంపిక చేసిన గ్రూప్‌లకు ఈ వారంలోగా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం 2లక్షల మంది సభ్యులతో గ్రూప్ చాట్‌ను అనుమతించే పోటీదారు టెలిగ్రామ్‌కు దగ్గరగా WhatsAppని అనుమతిస్తుంది.

5 WhatsApp features launching very soon WhatsApp Premium plan, new edit tool and more

5 WhatsApp features launching very soon WhatsApp Premium plan, new edit tool and more

3. Document sharing with caption :
WhatsApp యూజర్ల కోసం క్యాప్షన్‌లతో ఫోటోలు, వీడియోలు, GIFలను పంపడానికి అనుమతిస్తుంది. అయితే త్వరలో ప్లాట్‌ఫారమ్ కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తుంది. తద్వారా యూజర్లు తమ డాక్యుమెంట్లను క్యాప్షన్లతో పంపవచ్చు. సెర్చ్ ఆప్షన్‌ని ఉపయోగించి చాట్‌లో స్వీకరించిన లేదా పంపిన ఏదైనా డాక్యుమెంట్ల కోసం సెర్చ్ చేసేందుకు ఈ ఫీచర్ యూజర్లకు సాయపడుతుంది. అయితే, ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో బీటా టెస్టింగ్ కోసం రిలీజ్ చేసే అవకాశం ఉంది.

4. Screenshot blocking for View once media :
వాట్సాప్ ఎట్టకేలకు వినియోగదారులకు అవసరమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భద్రతను మెరుగుపరచడం మరియు వినియోగదారు గోప్యతను మెరుగుపరచడం కోసం, ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు వినియోగదారులు అన్ని మీడియా “ఒకసారి చూడండి” ఫోటోలు మరియు వీడియోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా నియంత్రిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది మరియు త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

5. WhatsApp Premium Subscription :
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను రూపొందించాలని వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వ్యాపారాలు మెరుగైన రీచ్, కొత్త డివైజ్‌లను లింక్ చేసేటప్పుడు మోడ్రాన్ పేమెంట్ ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. WhatsApp ప్రీమియం ఆప్షన్ ఎంచుకున్న బిజినెస్ అకౌంట్ల కోసం అందుబాటులో ఉన్నఏకైక ప్లాన్ ఇదే. ఆండ్రాయిడ్, iOS కోసం ఎంపిక చేసిన బీటా యూజర్ల కోసం ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. బీటా యూజర్లు WhatsApp సెట్టింగ్‌ ద్వారా బిజినెస్ కోసం WhatsApp ప్రీమియం ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Fake WhatsApp Apps : ఈ ఫేక్ వాట్సాప్ యాప్‌లు వాడుతున్నారా? మీ డేటా డేంజర్‌లో పడినట్టే.. సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!