Aadhaar Mobile Number : మీ ఆధార్‌లో మొబైల్ నెంబర్ ఇకపై ఇంటి వద్దనే మార్చుకోవచ్చు!
మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలా? అయితే ఇకపై మీరు ఏ ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి వద్దనే మీ ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు.

Aadhaar Card Mobile Number Update At Doorstep
Aadhaar Mobile Number : మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలా? అయితే ఇకపై మీరు ఏ ఆధార్ సెంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి వద్దనే మీ ఆధార్ లో మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు. పోస్ట్ మ్యాన్ సాయంతో ఆధార్ కార్డుదారులు సులభంగా మీ మొబైల్ నెంబర్ అప్ డేట్ చేసుకోవచ్చు. UIDAI రిజిస్ట్రార్‌గా ఆధార్‌లో మొబైల్ నంబర్లను అప్‌డేట్ కోసం IPPB ఆన్‌లైన్ ఒక సర్వీసును ప్రారంభించింది.
ఈ మేరకు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) పోస్ట్‌మెన్‌లకు ఆధార్ కార్డుదారుల మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసేందుకు అనుమతినిస్తుంది. UIDAI CEO డాక్టర్ సౌరభ్ గార్గ్ ప్రకారం.. ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి UIDAI పోస్ట్‌మెన్, Gramin Dak Sevaks ద్వారా IPPB ద్వారా నివాసితుల ఇంటి వద్ద మొబైల్ అప్‌డేట్ చేసుకునేలా సర్వీసులను తీసుకొచ్చింది.
ఆధార్‌లో మొబైల్ అప్‌డేట్ చేసుకోవడం ద్వారా UIDAI ఆన్‌లైన్ అప్‌డేట్ సదుపాయాలను, అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను పొందవచ్చు. 650 ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, 1.46 లక్షల మంది పోస్ట్‌మెన్, గ్రామిన్ డాక్ సేవక్స్ (GDS) నెట్‌వర్క్ ద్వారా ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం, IPPB మొబైల్ అప్ డేట్ సర్వీసులను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలో నెట్‌వర్క్ ద్వారా చైల్డ్ ఎన్ రోల్ మెంట్ సర్వీసును కూడా ప్రారంభించనుంది. మార్చి 31, 2021 నాటికి, UIDAI భారతదేశ నివాసితులకు 128.99 కోట్ల ఆధార్ నంబర్లను జారీ చేసింది.