Aadhaar Update Online : మీ ఆధార్ అప్‌డేట్ చేయలేదా? ఇంకా కొద్దిరోజులే.. ఈ తేదీలోగా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి!
Aadhaar Update Online : ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి పది సంవత్సరాలకు పీఓఐ, పీఓఏ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి.

Aadhaar Update Online ( Image Credit : Google )
Aadhaar Update Online : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2024 వరకు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌లను అప్‌డేట్ చేయడానికి గడువును పొడిగించింది. భారతీయ నివాసితులు తమ గుర్తింపు రుజువు (POI), అడ్రస్ ప్రూఫ్ (POA) అప్‌డేట్ చేసేందుకు ఇప్పుడు దాదాపు 10 రోజుల సమయం ఉంది.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి పది సంవత్సరాలకు పీఓఐ, పీఓఏ డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ అవసరం 5, 15ఏళ్ల వయస్సులో బ్లూ ఆధార్ కార్డ్‌లో బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేసేందుకు వర్తిస్తుంది. ముఖ్యంగా, మీరు పేరు, చిరునామా, పుట్టిన తేదీ/వయస్సు, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా, సంబంధ స్థితి వంటి జనాభా సమాచారాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఆధార్‌ను ఎందుకు అప్‌డేట్ చేయాలి? :
భారతీయ నివాసితులకు జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధార్. ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి, ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా నిర్వహించడానికి అవసరం. ఆధార్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడంతో పాటు మోసపూరిత కార్యకలాపాలను గుర్తించడంలో సాయపడుతుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి : (uidai.gov.in)కి వెళ్లి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
అప్‌డేట్ ఫీచర్‌ని యాక్సెస్ చేయండి: “My Aadhaar” ట్యాబ్‌పై క్లిక్ చేసి డ్రాప్‌డౌన్ మెను నుంచి “Update Your Aadhaar” ఎంచుకోండి.
అప్‌డేట్ కంటిన్యూ చేయండి : మీరు “Update Your Aadhaar Details (ఆన్‌లైన్)” పేజీకి రీడైరెక్ట్ అవుతారు. “Update Document”పై క్లిక్ చేయండి.
మీ అథెంటికేషన్ చేయండి : మీ యూఐడీ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను పొందడానికి “Send OTP” క్లిక్ చేయండి.
లాగిన్ వివరాలు : ఓటీపీ అందుకున్న తర్వాత ఎంటర్ చేసి “Login” ఆప్షన్ క్లిక్ చేయండి.
వివరాలను ఎంచుకుని నింపండి : మీరు అప్‌డేట్ చేయాలనుకునే జనాభా వివరాలను (పేరు, అడ్రస్, పుట్టిన తేదీ మొదలైనవి) ఎంచుకోండి. కొత్త సమాచారాన్ని కచ్చితంగా పూరించండి.
డాక్యుమెంట్లను సమర్పించి అప్‌లోడ్ చేయండి : మీరు అవసరమైన మార్పులు చేసిన తర్వాత “Submit” క్లిక్ చేసి మీ అప్‌డేట్ అభ్యర్థనకు సపోర్టుకు అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
అప్‌డేట్ ఫైనలైజ్ చేయండి : “Sumbit Update Request” క్లిక్ చేయండి. మీ అభ్యర్థన స్థితిని ట్రాక్ చేయడానికి ఎస్ఎంఎస్ ద్వారా అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN)ని అందుకుంటారు.
ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు :
(myAadhaar) పోర్టల్‌లో మీ ఆధార్ అప్‌డేట్‌కు సపోర్టు ఇవ్వడానికి మీరు ఉపయోగించే డాక్యుమెంట్ల జాబితాను తెలుసుకుందాం.
ఐడెంటిటీ ప్రూఫ్ : పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటరు ఐడీ, ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు, మార్క్‌షీట్‌లు, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్.
అడ్రస్ ప్రూఫ్ : బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు (3 నెలల కన్నా పాతది కాదు), విద్యుత్ లేదా గ్యాస్ కనెక్షన్ బిల్లులు (3 నెలల కన్నా పాతది కాదు), పాస్‌పోర్ట్, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఆస్తి పన్ను రసీదులు (సంవత్సరం కన్నా పాతది కాదు), ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డులు.
ముఖ్యంగా, మీరు బయోమెట్రిక్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయలేరు. ఫేషియల్ ఫొటోగ్రాఫ్స్, ఐరిస్ స్కాన్‌లు లేదా ఫింగర్ ఫ్రింట్స్ వంటి బయోమెట్రిక్ ఫీచర్‌లను అప్‌డేట్ చేయడానికి మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ తప్పక సందర్శించాలి. మీరు ఈ వివరాలను ఎలా అప్‌డేట్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
- సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని గుర్తించేందుకు (UIDAI) వెబ్‌సైట్ (bhuvan.nrsc.gov.in/aadhaar/)ని ఉపయోగించండి.
- మీ బయోమెట్రిక్ డేటాను (వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫొటోగ్రాఫ్స్) అందించండి.
- అథెంటికేషన్ కోసం ఆధార్ కేంద్రంలో అందించిన సూచనలను అనుసరించండి.
- ధృవీకరణకు అవసరమైన ఏవైనా సహాయక డాక్యుమెంట్లను సమర్పించండి.
- మీ బయోమెట్రిక్ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం ద్వారా మీరు (URN)తో రసీదుని అందుకుంటారు.
జూన్ 14 తర్వాత ఏం జరుగుతుందంటే? :
జూన్ 14, 2024 వరకు మీ ఐడెంటిటీ, అడ్రస్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తేదీ తర్వాత ఏదైనా అప్‌డేట్ చేస్తే అందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్‌డేట్‌లకు రూ. 25 ఖర్చవుతుంది. ఆఫ్‌లైన్ అప్‌డేట్‌లకు రూ. 50 ఖర్చు అవుతుంది. ఈ ఉచిత అప్‌డేట్ విండోను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ ఆధార్ డేటాను కచ్చితంగా సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు. అవసరమైన సేవలు, ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది.