కమింగ్ సూన్ : ఇండియా బోర్డర్ లో పెట్రోలింగ్ రోబోలు
అంతర్జాతీయ సరిహద్దుల్లో త్వరలో పెట్రోలింగ్ రోబోలు రానున్నాయి. 2019 ఏడాది డిసెంబర్ లో ఏఐ టెక్నాలజీతో రూపొందిన రోబోలను ప్రవేశపెట్టనున్నారు.

అంతర్జాతీయ సరిహద్దుల్లో త్వరలో పెట్రోలింగ్ రోబోలు రానున్నాయి. 2019 ఏడాది డిసెంబర్ లో ఏఐ టెక్నాలజీతో రూపొందిన రోబోలను ప్రవేశపెట్టనున్నారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లో త్వరలో పెట్రోలింగ్ రోబోలు రానున్నాయి. 2019 ఏడాది డిసెంబర్ లో ఏఐ టెక్నాలజీతో రూపొందిన రోబోలను ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో భద్రతా సిబ్బందికి రక్షణగా దేశ సరిహద్దుల్లో ఈ ఏఐ రోబోలనే వినియోగించే అవకాశం ఉంది. బెంగళూరు ఆధారిత సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఫెన్స్ పీఎస్ యూ భారత్ ఎలక్ట్ర్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఏఐ రోబోల క్రియేషన్ కు సంబంధించి ప్రొటోటైప్ డెవలప్ మెంట్ పై పనిచేస్తున్నట్టు ఇండియన్ సైంటిస్టులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటివరకూ 80 మంది సైంటిస్టులు, ఇంజినీర్లు.. బెంగళూరు, ఘజియాబాద్ లోని ఏఐ స్పెషిఫిక్ ల్యాబ్స్-CRLs, బెల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ సెంటర్ (BSTC)లో ఏఐ పెట్రోల్ రోబోల రూపకల్పనపై పనిచేస్తున్నారని, వీరి సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీతో రూపొందిన బెల్ రోబోలు సెన్సార్ల సాయంతో కంట్రోల్ సెంటర్ తో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అయ్యేలా ప్రొగ్రామ్ చేయనున్నట్టు ఓ నివేదిక తెలిపింది.
విధ్వంసక పరిస్థితుల్లో సైతం సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఈ రోబోలకు ఉంటుందని పేర్కొంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల వంటి చర్యలపై ముందుగానే నిఘా పెట్టేందుకు ఈ రోబోలు ఎంతో సహకరిస్తాయని నివేదిక తెలిపింది. సరిహద్దుల్లో మోహరించిన భద్రత బలగాల ప్రాణాలను రక్షించడమే ప్రాథమిక లక్ష్యంగా పెట్రోలింగ్ రోబోలను వినియోగంలోకి తేనున్నట్టు పేర్కొంది.
ఈ ఏఐ రోబోల తయారీకి.. రూ.70లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇండియన్ ఆర్మీ.. పెద్ద ఆర్డర్లు చేస్తే రోబోల ప్రైస్ ట్యాగ్ తగ్గే అవకాశం ఉంటుందని నివేదిక తెలిపింది. సైంటిస్టులు, ఇంజినీర్ల బృందం ఇప్పటికే ప్రాథమిక స్థాయి రోబోను డెవలప్ చేయగా.. AI సామర్థ్యంతో వచ్చే జనరేషన్ కు తగినట్టుగా రోబోలను రూపొందించే పనిలో నిమగ్నమైనట్టు పేర్కొంది.
ప్రత్యేక టాస్క్ ల్లో రోబోలు సమర్థవంతంగా పనిచేసేందుకు వీలుగా అల్గారిథిమ్స్ ను కస్టమైజ్ చేసేందుకు వినియోగించే అవకాశం ఉందని బెల్ సీఎండీ గౌతమా ఎంవీ తెలిపారు. 2019 డిసెంబర్ తొలివారంలోగా మొదటి ప్రొటోటైప్ పై అంతర్గత రివ్యూను నిర్వహించేందుకు BEL ప్లాన్ చేస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఏఐ రోబోల యూజర్ ట్రయల్స్ ఫిబ్రవరి 2020 నాటికి జరుగనున్నట్టు నివేదిక తెలిపింది. 2019 ఏడాది ఆఖరిలోగా రోబోలతో పాటు ఇతర ఏఐ టెక్నాలజీ ప్రొడక్టులను సిద్ధం చేసే దిశగా అడుగులు వేయనున్నట్టు నివేదిక పేర్కొంది.