ఏఐ వాడుతున్న వారి సంఖ్య 6 నెలల్లో ఎంతగా పెరిగిందో తెలుసా? 

AI Users: ఏఐతో పనిచేస్తున్న సమయంలో పనిని మరింత ఆస్వాదించామని 83 శాతం మంది యూజర్లు తెలిపారు.

ఏఐ వాడుతున్న వారి సంఖ్య 6 నెలల్లో ఎంతగా పెరిగిందో తెలుసా? 

Artificial Intelligence

Updated On : May 12, 2024 / 5:02 PM IST

కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. ఏఐను వాడుతున్న వారు ఆరు నెలల్లో 83 శాతం మంది పెరిగారని మైక్రోసాఫ్ట్, లింకెడిన్ చేసిన సర్వే ‘వర్క్ ట్రెండ్ ఇండెక్స్ వార్షిక నివేదిక-2024లో తేలింది.

పనిలో వేగాన్ని పెంచుకోవడానికి ఉద్యోగులు ఏఐను బాగా వాడుతున్నారు. బిజినెస్ లో ఏఐ ప్రాముఖ్యతను ఉద్యోగులు గుర్తిస్తున్నారు. అయితే, ఏఐ వినియోగం విషయంలో తమ సంస్థలకు సరైన వ్యూహాలు, పాలసీలు లేవని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

ఏఐ తమ పనిలో సమయాన్ని ఆదాచేయడంలో సాయపడిందని సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యూజర్లు తెలిపారు. ఏఐ వల్ల అత్యంత కీలకమైన పనులపై దృష్టి పెట్టగలిగామని 85 శాతం మంది తెలిపారు. చాలా క్రియేటివ్ గా ఏఐను వాడినట్లు 84 శాతం మంది చెప్పారు.

ఏఐతో పనిచేస్తున్న సమయంలో పనిని మరింత ఆస్వాదించామని 83 శాతం మంది యూజర్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఏఐ వాడడం అవసరమని 79 శాతం మంది అన్నారు. అయితే, ఏఐ వాడకం వల్ల వచ్చే ఉత్పాదకత, లాభాల విషయంలో 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: బీచ్‌లో చెప్పులు లేకుండా యువకుడు వాకింగ్.. మాంసాన్ని తినే బాక్టీరియా సోకి..