Airtel 5G Services : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో రెండు నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్ట్ మీకోసం..!
Airtel 5G Services : దేశీయ టెలికాం దిగ్గజాల్లో భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G నెట్‌వర్క్ పరిధిని విస్తరిస్తోంది. తాజాగా హర్యానాలోని హిస్సార్, రోహ్‌టక్‌లలో 5G సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Airtel 5G Services now available in Hissar, Rohtak, Two other Cities, Full List Here
Airtel 5G Services : దేశీయ టెలికాం దిగ్గజాల్లో భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తమ 5G నెట్‌వర్క్ పరిధిని విస్తరిస్తోంది. తాజాగా హర్యానాలోని హిస్సార్, రోహ్‌టక్‌లలో 5G సర్వీసులను ప్రారంభించినట్లు ప్రకటించింది. Airtel 5G సర్వీసులను ఇప్పటికే గురుగ్రామ్, పానిపట్‌లలో అందుబాటులోకి వచ్చేశాయి. గురుగ్రామ్, పానిపట్‌లకు అదనంగా హిస్సార్, రోహ్‌తక్ అల్ట్రాఫాస్ట్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులను పొందుతాయని కంపెనీ పేర్కొంది.
ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను విస్తరించే పనులను పూర్తి చేయడంతో ఎయిర్‌టెల్ ‘5G Plus‘ సర్వీసులు దశలవారీగా యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ ప్రకారం.. 5G-రెడీ డివైజ్‌లను యూజర్లు మరింత విస్తృతమయ్యే వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై-స్పీడ్ Airtel 5G నెట్‌వర్క్‌ను పొందవచ్చు. తరుణ్ విర్మణి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్యానా, భారతీ ఎయిర్‌టెల్ రెండు నగరాల్లోని కస్టమర్‌లు అల్ట్రా-ఫాస్ట్ నెట్‌వర్క్‌లను పొందవచ్చు.
ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు ఎక్కువ స్పీడ్ పొందవచ్చని చెప్పారు. టెలికాం దిగ్గజం ఇండోర్‌లో తన 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. 5G-రెడీ డివైజ్‌లను కలిగి ఉన్న యూజర్లు ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తృతం చేసే వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది.

Airtel 5G Services now available in Hissar, Rohtak, Two other Cities
ఎయిర్‌టెల్ ప్రకారం.. 5G సర్వీసులు ప్రస్తుతం విజయ్ నగర్, రసోమా చౌక్, బాంబే హాస్పిటల్ స్క్వేర్, రాడిసన్ స్క్వేర్, ఖజ్రానా ఏరియా, సదర్ బజార్, గీతా భవన్, పంచశీల్ నగర్, అభినందన్ నగర్, పాత్రకర్ కాలనీ, యశ్వంత్ రోడ్, ఫీనిక్స్ సిటాడెల్ మాల్ కొన్నింటిలో 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ఇతర ఆప్షన్ స్థానాల్లో కంపెనీ నెట్‌వర్క్‌ను పెంచి తగిన సమయంలో నగరం అంతటా తన 5G సర్వీసులను అందుబాటులో అని ఎయిర్‌టెల్ తెలిపింది. కంపెనీ ప్రకారం, ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీస్ టెల్కో అందించే మొత్తం పోర్ట్‌ఫోలియో సేవలను పెంచుతుంది. భారతీ ఎయిర్‌టెల్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్ CEO సుజయ్ చక్రబర్తి మాట్లాడుతూ.. Airtel కస్టమర్‌లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ నెట్‌వర్క్‌ను పొందవచ్చు. ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు ఎక్కువ స్పీడ్‌ను పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Redmi K60 Series : షావోమీ రెడ్‌మి K60 సిరీస్ వచ్చేసిందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!