Redmi K60 Series : షావోమీ రెడ్‌మి K60 సిరీస్ వచ్చేసిందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi ఇటీవల భారత మార్కెట్లో నోట్ 12 సిరీస్‌ (Redmi K60 Series)ను లాంచ్ చేసింది. Redmi K60 సిరీస్ ఫోన్‌లను దేశంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Redmi K60 Series : షావోమీ రెడ్‌మి K60 సిరీస్ వచ్చేసిందోచ్.. ఇండియాలో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Redmi K60 Series _ This is how much Xiaomi Redmi K60 series may cost in India

Redmi K60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ Redmi ఇటీవల భారత మార్కెట్లో నోట్ 12 సిరీస్‌ (Redmi K60 Series)ను లాంచ్ చేసింది. Redmi K60 సిరీస్ ఫోన్‌లను దేశంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. Redmi Note 12 5G సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో.. రాబోయే స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర రూ. 30వేల కన్నా ఎక్కువగా ఉంటుందని కంపెనీ సూచించింది.

రెడ్‌మి K60 సిరీస్ గత ఏడాదిలో డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. అందులో మూడు ఫోన్‌లలో (Redmi K60, Redmi K60 Pro, Redmi K60E) అందుబాటులో ఉండనుంది. Redmi Note 12 సిరీస్ లాంచ్‌లో Xiaomi ధృవీకరించినట్లుగా Redmi K60 సిరీస్‌లోని మూడు ఫోన్‌ల ధర రూ. 30వేల కన్నా ఎక్కువగా ఉండవచ్చు. రాబోయే హ్యాండ్‌సెట్‌ల లాంచ్ తేదీ ఇంకా రివీల్ చేయలేదు.

Redmi K60 Series _ This is how much Xiaomi Redmi K60 series may cost in India

Redmi K60 Series _ This is how much Xiaomi Redmi K60 series

Read Also : Redmi K50i : వన్‌ప్లస్, ఒప్పోకు పోటీగా.. రెడ్‌మి K50i స్మార్ట్ ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?

రెడ్‌మి K60 సిరీస్ స్పెసిఫికేషన్స్ :
రెడ్‌మి K60 సిరీస్‌లో Redmi K60, Redmi K60 Pro, Redmi K60E వంటి 3 ఫోన్‌లు ఉన్నాయి. ప్రామాణిక Redmi K60 6.67-అంగుళాల OLED స్క్రీన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 1440×3200 పిక్సెల్‌ల 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్టుతో వస్తుంది.1400 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.

వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంటుంది. 64MP ప్రధాన కెమెరా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్‌తో వచ్చింది. కెమెరా 24fps వద్ద 8K వీడియోలను షూట్ చేయవచ్చు. సెల్ఫీల కోసం, హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ డివైజ్ 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందిస్తుంది. 30 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi K60 Series : అద్భుతమైన ఫీచర్లతో రెడ్‌మి K60 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!