Redmi K50i : వన్‌ప్లస్, ఒప్పోకు పోటీగా.. రెడ్‌మి K50i స్మార్ట్ ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెడ్‌మీ కొత్త టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

Redmi K50i : వన్‌ప్లస్, ఒప్పోకు పోటీగా.. రెడ్‌మి K50i స్మార్ట్ ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?

Redmi K50i Launched In India Price, Top Features And Everything Else You Need To Know (2)

Updated On : July 20, 2022 / 9:08 PM IST

Redmi K50i : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెడ్‌మీ కొత్త టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. Redmi K50i స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. ఆల్ రౌండ్ యూజర్ పర్ఫార్మెన్స్ అందించనుంది. Redmi K50i డైమెన్సిటీ 8100 SoCని కలిగి ఉంది.

OnePlus 10R, Realme GT Neo 3, Oppo Reno 8 Pro 5G ఫోన్ల మాదిరిగా పర్ఫార్మెన్స్ అందించనుంది. అలాగే Redmi K50i 144Hz డిస్‌ప్లే మాదిరిగా ఉండనుంది. ఇక వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ. 30వేల లోపు ధర ఉన్న ఈ డివైజ్ ఇతర స్మార్ట్ ఫోన్లలలో iQOO Neo 6, OnePlus Nord 2T 5G, Poco F4 5G, Xiaomi 11i హైపర్‌ఛార్జ్ వంటి ఫోన్లతో పోటీ పడుతోంది.

రెడ్‌మి K50i స్పెసిఫికేషన్స్ :

Display : 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.6-అంగుళాల Full HD+ IPS LCD.
Processor : MediaTek డైమెన్సిటీ 8100 SoC
RAM : 6GB/ 8GB
Storage : 128GB/ 256GB
Software : ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13
Rear Camera : 64MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రావైడ్ కెమెరా + 2MP మాక్రో సెన్సార్
Front : 16MP
Battery : 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5080 mAh (బాక్స్‌లో ఛార్జర్ అందించారు)

Redmi K50i Launched In India Price, Top Features And Everything Else You Need To Know (1)

Redmi K50i Launched In India Price, Top Features And Everything Else You Need To Know 


Redmi K50i : టాప్ ఫీచర్లు :

Redmi K50i LCD ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. HDR10 సర్టిఫికేషన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది.
6.6-అంగుళాల ఎడ్జ్-ఫీల్డ్ స్విచింగ్ (FFS) LCD DCI-P3 కలర్ సపోర్టు ఇస్తుంది. క్లియర్ వ్యూ ఎక్స్ పీరియన్స్
Redmi K50i డ్యూయల్ స్పీకర్లు Dolby Atmos సపోర్టుతో వస్తాయి.
ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
Redmi K50i థర్మల్ మేనేజ్‌మెంట్ 7-లేయర్ గ్రాఫైట్, స్టీమ్ చాంబర్‌తో పాటు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ 2.0 ఉంది.
ఈ ఫోన్‌లో పాలికార్బోనేట్ బ్యాక్ ఉంది. బరువు 200 గ్రాములు, మందం 8.87 మి.మీగా ఉంది.
Redmi K50i మెయిన్ కెమెరా Samsung GW1 64MP సెన్సార్‌తో వచ్చింది.

భారత్‌లో Redmi K50i ధర ఎంతంటే? :

భారత మార్కెట్లో Redmi K50i బేస్ 6GB + 128GB మోడల్ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB+256GB మోడల్‌లో కూడా వస్తుంది. దీని ధర రూ. 28,999. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. జూలై 23 నుంచి Mi.com, Mi హోమ్ స్టోర్స్, అమెజాన్ ఇండియా, రిటైల్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.

Read Also : Redmi K50i 5G : ఇండియాలో రెడ్‌మి K సిరీస్ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?