Airtel Unlimited 5G Data : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్.. అన్‌లిమిటెడ్ 5G డేటా, ఫ్రీ డిస్నీ ప్లస్ సబ్‌స్ర్కిప్షన్, 15కు పైగా ఓటీటీ ఛానల్స్..

Airtel Unlimited 5G Data : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్‌తో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. మొత్తానికి 15పైగా ఓటీటీ ఛానల్స్ యాక్సస్ చేసుకోవచ్చు.

Airtel is offering unlimited 5G data with free Disney+ Hotstar subscription

Airtel Unlimited 5G Data : ప్రస్తుత దేశీయ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel), విభిన్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ఇంటర్నెట్ నుంచి 5G డేటా యాక్సెస్, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌ల వరకు, ఎయిర్‌టెల్ అందరికీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల రేంజ్ కలిగి ఉంది. మరో టెలికం పోటీదారు రిలయన్స్ జియో (Reliance Jio) మాదిరిగా కాకుండా, ఎయిర్‌టెల్ ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తోంది.

తద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన షోలతో పాటు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. మీరు యాడ్ చేసిన OTT బెనిఫిట్స్‌తో ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, 15 ఇతర OTT ఛానెల్‌లతో సహా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, 5G డేటా, OTT బెనిఫిట్స్ అందించే ఎయిర్‌టెల్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

ఓటీటీ బెనిఫిట్స్‌తో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు :

రూ. 359 ప్లాన్ : ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, ఒక నెల వ్యాలిడిటీతో 2GB రోజువారీ డేటా క్యాప్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ Apollo 24|7, Hellotunes, (Airtel Xstream Play) వంటి అనేక అదనపు బెనిఫిట్స్ ఆస్వాదించవచ్చు. Airtel Xstream Play Sony LIV, Eros Now, Lionsgate Play ఇతరులతో సహా 15 కన్నా ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, అర్హత ఉన్న నగరాలు లేదా పట్టణాల్లోని యూజర్లు 5G ఇంటర్నెట్ డేటాకు యాక్సెస్‌ను కూడా పొందవచ్చు.

Read Also : Apple iPhone 12 Mini Sale : ఆపిల్ ఐఫోన్ 12 మినీపై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 16,999కే సొంతం చేసుకోండి.. డోంట్ మిస్..!

రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 3GB హై-స్పీడ్ డేటా క్యాప్‌తో డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. పై ప్లాన్‌ల మాదిరిగానే ఈ ప్యాక్ 15+ OTT ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే (Airtel Xstream Play)కి ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు బెనిఫిట్స్ కూడా కలిగి ఉంది.

Airtel is offering unlimited 5G data with free Disney+ Hotstar subscription

రూ. 499 ప్లాన్ : ఎయిర్‌టెల్ 5G బెనిఫిట్స్‌తో రూ. 399 ప్లాన్‌తో పోలిస్తే.. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌కు దాదాపు సమానమైన బెనిఫిట్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

రూ. 699 ప్లాన్ : మీరు ఒక నెల కన్నా ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నారా? ఈ ప్లాన్ మీ కోసమే. ఈ ప్లాన్‌తో, ఎయిర్‌టెల్ 3GB రోజువారీ డేటాను, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో, 56 రోజుల వ్యాలిడిటీతోరోజుకు 100 SMSలను అందిస్తుంది. వినియోగదారులు (Airtel Xstream Play)కి ఉచిత యాక్సెస్, 56 రోజుల (Amazon Prime) మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు.

రూ. 839 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 5G బెనిఫిట్స్ అందిస్తుంది. Airtel Xtream Play, Disney+ Hotstar మొబైల్ అదనపు బెనిఫిట్స్ సహా 3 నెలల పాటు పొందవచ్చు.

రూ. 999 ప్లాన్ : ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ యూజర్లు 84 రోజుల పాటు కాలింగ్, 5G డేటా, (Airtel Xtreme Play) సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, యూజర్లు ప్యాక్ వ్యాలిడిటీ వరకు వ్యాలిడిటీ అయ్యే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా పొందవచ్చు.

రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అర్హత ఉన్న యూజర్లతో 5G యాక్సెస్‌ను అందిస్తుంది. దాంతో పాటుగా ఎయిర్‌టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ వార్షిక సబ్‌స్క్రిప్షన్, Apollo 24|7 మెంబర్‌షిప్, మరిన్ని అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

Read Also : Apple iPhone 14 Price : అమెజాన్‌లో తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్.. ఇదే సరైన సమయం.. వెంటనే కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు