Airtel Launches In-Flight Roaming Plans for Prepaid and Postpaid Users
Airtel In-Flight Roaming Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌లను ప్రకటించింది. విమానంలో ప్రయాణించే సమయంలో ఈజీగా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వొచ్చు. అంతేకాదు.. హై-స్పీడ్ డేటా, లిమిటెడ్ మినట్స్, ఫ్రీ కాలింగ్ వంటివి పరిమిత సంఖ్యలో ఉచిత ఎస్ఎంఎస్ సేవలను అందజేస్తుందని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ పేర్కొంది. ఈ ప్లాన్ కోసం ప్రత్యేకించి విడిగా రీఛార్జ్ వద్దనే వారి కోసం సర్వీసును నిర్దిష్ట అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లతో అందిస్తోంది. ఇప్పటికే, రిలయన్స్ జియో అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే కస్టమర్ల కోసం ఇలాంటి ప్యాక్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ ప్లాన్ల ధరలివే :
ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఇన్-ఫ్లైట్ రోమింగ్ ప్లాన్‌ల ధర రూ. 195కే ఆఫర్ చేస్తోంది. అన్ని ఆఫర్లకు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.195 ప్లాన్‌తో 250ఎంబీ డేటా, 100 నిమిషాల అవుట్‌గోయింగ్ కాల్స్, 100 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్‌లను పొందుతారు. దీనికి అప్‌గ్రేడ్ రూ. 295 ప్లాన్ కూడా తీసుకోవచ్చు.
అయితే, ఈ ప్లాన్ కింద 500ఎంబీ డేటాతో పాటు 100 నిమిషాల ఫ్రీ కాలింగ్, 100 అవుట్‌గోయింగ్ ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ. 595 కూడా ఉంది. దీనిపై 1జీబీ డేటా, అదే కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల మధ్య ధర లేదా ప్రయోజనాలలో తేడా లేదని గమనించాలి.
ఒకవేళ, వినియోగదారులు ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్ వద్దనుకుంటే.. ఎయిర్‌టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లకు కూడా అదే ప్రయోజనాలతో అందిస్తోంది. రీఛార్జ్ ప్లాన్ కొనుగోలు చేసే వారు రూ. 2,997, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఆటోమేటిక్‌గా 250ఎంబీ డేటా, 100 నిమిషాల ఫ్రీ అవుట్‌గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అదేవిధంగా, అంతర్జాతీయ రోమింగ్ సభ్యత్వం పొందిన పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ. 3,999, అంతకంటే ఎక్కువ ప్రీపెయిడ్ కస్టమర్‌లకు సమానమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
వినియోగదారుల కోసం ఆఫర్లు :
ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం అనేక ఆఫర్లను ప్రకటిస్తోంది. అందులో ప్రధానంగా కనెక్టివిటీని మరింత మెరుగుపర్చేందుకు యూకే ఆధారిత ఇన్-ఫ్లైట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఏరోమొబైల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వివిధ అంతర్జాతీయ రంగాల్లో ప్రయాణించే 19 ఎయిర్‌లైన్స్‌లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఏ ఎయిర్‌లైన్స్‌ను చేర్చాలో పేర్కొనలేదు. అయితే, ఏరోమొబైల్ ద్వారా సేవలు అందించే ఎయిర్‌లైన్స్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
యూజర్ల కోసం 24 గంటల సపోర్టు :
విమానంలో ఉన్న సమయంలో యూజర్లను కంపెనీ సపోర్ట్ టీమ్‌తో కనెక్ట్ కావడానికి మల్టీ ఛానెల్‌లను కూడా కలిగి ఉంది. వినియోగదారులు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సంప్రదించవచ్చు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు కాంటాక్టు సెంటర్ ద్వారా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. డేటా వినియోగాన్ని పర్యవేక్షించడానికి, అదనపు నిమిషాల కోసం లేదా రియల్ టైమ్ బిల్లింగ్ వివరాలను పొందడానికి వినియోగదారులు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కూడా లాగిన్ అవ్వొచ్చు.
Read Also : iQoo Z9 5G Launch : భారత్‌కు భారీ బ్యాటరీతో ఐక్యూ Z9 5జీ ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు, డిజైన్ ఇదిగో..!