iQoo Z9 5G Launch : భారత్‌కు భారీ బ్యాటరీతో ఐక్యూ Z9 5జీ ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు, డిజైన్ ఇదిగో..!

iQoo Z9 5G Launch India : భారత మార్కెట్లోకి ఐక్యూ కొత్త 5జీ ఫోన్ రాబోతోంది. లాంచ్‌కు ముందుగానే కొన్ని కీలక ఫీచర్లతో పాటు డిజైన్ వివరాలను రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iQoo Z9 5G Launch : భారత్‌కు భారీ బ్యాటరీతో ఐక్యూ Z9 5జీ ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు, డిజైన్ ఇదిగో..!

iQoo Z9 5G to launch in India soon, key specs and design revealed

Updated On : February 22, 2024 / 5:53 PM IST

iQoo Z9 5G Launch India : చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐక్యూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ లాంచ్‌కు ముందుగానే కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియాలో మైక్రోసైట్ ద్వారా కొన్ని ముఖ్య ఫీచర్లను ధృవీకరించింది. ఐక్యూ జెడ్9 5జీ గత ఏడాది చైనాలో ప్రవేశపెట్టిన ఐక్యూ జెడ్8 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తోంది.

Read Also : Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!

ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో ఆస్ఫెరికల్ ప్రీమియం లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటాయి. దీర్ఘచతురస్రాకార డిజైన్‌తో మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఫోన్ వస్తుంది.

ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 7200 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది. అదే విభాగంలో అత్యంత వేగవంతమైన ఫోన్‌గా రానుందని కంపెనీ పేర్కొంది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అయితే, ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

రూ.25వేల లోపు ధరలో..? :
గత లీక్‌ల ప్రకారం.. ఐక్యూ జెడ్9 5జీ ఫోన్ 1.5కె ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ ఫోన్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి కూడా సపోర్టు ఇస్తుంది. భారత మార్కెట్లో ఐక్యూ కొత్త ఫోన్ ధర రూ. 25వేల లోపు ఉండవచ్చని అంచనా.

ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ కూడా :
గత డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయిన ఐక్యూ నియో 9 ప్రో తర్వాత భారతీయ మార్కెట్లోకి రానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఐక్యూ నియో 9 ప్రో రీఫండబుల్ మొత్తాన్ని రూ. 1000 చెల్లించి ప్రీ బుకింగ్ చేయవచ్చు. తద్వారా 2 సంవత్సరాల వారంటీతో పాటు అనేక ఇతర లాంచ్ డే ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

ఐక్యూ నియో 9 ప్రో కీలక స్పెసిఫికేషన్‌లను అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీతో రానుంది. మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే ప్రత్యేకమైన క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్‌సెట్‌తో వస్తుంది. 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50ఎంపీ ఐఎమ్ఎక్స్ 920 ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Read Also : Oppo F25 Pro 5G Launch : 64ఎంపీ కెమెరాతో ఒప్పో F25 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?