Oppo F25 Pro 5G Launch : 64ఎంపీ కెమెరాతో ఒప్పో F25 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F25 Pro 5G Launch : ఒప్పో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ లాంచ్ కానుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Oppo F25 Pro 5G Launch : 64ఎంపీ కెమెరాతో ఒప్పో F25 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 29నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Oppo F25 Pro 5G, With a 64-Megapixel Camera, Confirmed

Oppo F25 Pro 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి కొత్త ఫోన్ రాబోతోంది. ఒప్పో ఎఫ్ సిరీస్ ఫోన్‌గా ఒప్పో ఎఫ్25 ప్రో 5జీని ప్రకటించింది. దేశ మార్కెట్లో ఫిబ్రవరి 29న ఈ కొత్త ఎఫ్ సిరీస్ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

లాంచ్ డేట్‌తో పాటు, కంపెనీ ఫోన్ డిజైన్, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించింది. రాబోయే హ్యాండ్‌సెట్ రీబ్రాండెడ్ ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ మాదిరిగా ఉండనుంది. ఈ ఫోన్ ఇటీవలే ఇండోనేషియాలో లాంచ్ అయింది. ఇప్పటివరకు, ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్‌కు సంబంధించి ఒక కలర్ ఆప్షన్ మాత్రమే వెల్లడించింది.

Read Also : Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!

ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ ధర రూ. 25వేల సెగ్మెంట్, లావా రెడ్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ మైక్రోసైట్ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ బ్లూ ఫినిషింగ్‌లో అందుబాటులో ఉంటుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఒప్పో ఎఫ్25 ప్రో 5జీ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే పాండా గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో 7.54ఎమ్ఎమ్ మందం కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

రెండు ట్రిపుల్ కెమెరాలతో :
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. నిలువుగా వృత్తాకార మాడ్యూల్స్‌లో రెండు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. సెటప్‌లో 64ఎంపీ ప్రైమరీ షూటర్, 112-డిగ్రీ ఫీల్డ్ విజన్‌తో 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32ఎంపీ లెన్స్‌తో సెంట్రల్ హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది.

ఏఐ అధారిత ఫీచర్లతో ఒప్పో 5జీ ఫోన్ :
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కెమెరా ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుందని నివేదిక పేర్కొంది. అందులో ఒకటి ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్.. యూజర్ల ఫొటోను క్యాప్చర్ చేసేందుకు మరో యాప్‌తో షేర్ చేయగల ట్రాన్స్‌పరంట్ పీఎన్‌జీ ఫార్మాట్‌లో అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఐఓఎస్ 16 కలిగిన ఐఫోన్‌లో మాదిరి ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యూటీ ఫిల్టర్‌లు, పోర్ట్రెయిట్ మోడ్‌లో కూడా పొందవచ్చు. రాబోయే ఒప్పో రెనో ఎఫ్ 25 ప్రో మోడల్ గ్లోబల్ వేరియంట్ కానుంది. నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ 8జీబీ వరకు ర్యామ్ 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ ఉండవచ్చు. 67డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో ఫోన్‌కు సపోర్టు ఉంటుందని లీక్ సూచించింది.

Read Also : Safest SUVs in India : భారత్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగిన టాప్ 5 ఎస్‌యూవీ కార్లు ఇవే.. ఏయే మోడల్స్ ధర ఎంతంటే?