Safest SUVs in India : భారత్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగిన టాప్ 5 ఎస్‌యూవీ కార్లు ఇవే.. ఏయే మోడల్స్ ధర ఎంతంటే?

Safest SUV Cars in India : భారత్‌లో అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీ కార్లు ఏంటో తెలుసా? 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన టాప్ 5 బ్రాండ్ కార్ల జాబితా గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Safest SUVs in India : భారత్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ కలిగిన టాప్ 5 ఎస్‌యూవీ కార్లు ఇవే.. ఏయే మోడల్స్ ధర ఎంతంటే?

Safest SUV Cars in India : 5 Top Brand Cars with 5-star safety rating, Check Full Details

Safest SUV Cars in India : భారత మార్కెట్లో అత్యాధునిక భద్రతా ఫీచర్లతో అనేక కొత్త మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువగా 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ పెరుగుతోంది. భద్రతపరమైన ఫీచర్లను కలిగిన కార్లవైపే వినియోగదారులు కూడా మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం ప్యాసింజర్ వెహికల్ (PV) ఇండస్ట్రీ రెండు సరికొత్త ట్రెండ్‌లతో నడుస్తోంది. అందులో ఒకటి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) సెగ్మెంట్ కాగా.. మరొకటి సెక్యూరిటీ ప్రొగ్రామ్.. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ లేదా భారత్ ఎన్‌సీఎపీగా సూచించే సొంత వాహన భద్రతా పరీక్ష ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

Read Also : Tata Tiago EV Price Drop : టాటా టియాగో ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్.. గరిష్టంగా రూ.70వేల వరకు తగ్గింపు.. కొత్త ధర ఎంతంటే?

మన దేశంలో విక్రయించే అనేక కార్లు గ్లోబల్ ఎన్‌సీఎపీ ద్వారా టెస్టింగ్ పొందినవే ఉన్నాయి. పీవీ మార్కెట్‌లో ఎస్‌యూవీ సెగ్మెంట్ దాదాపు 50శాతానికి చేరుకున్నాయి. అయితే, గ్లోబల్ ఎన్‌సీఎపీలో అత్యధిక భద్రతా రేటింగ్‌తో భారత్‌లో విక్రయించే ఐదు టాప్ బ్రాండ్ల ఎస్‌యూవీ కార్లను ఓసారి లుక్కేయండి.

టాటా సఫారి :
కొత్త టాటా సఫారి గ్లోబల్ ఎన్‌సీఎపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటిలోనూ 5 స్టార్ స్కోర్ చేసింది. టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు 33.05 పాయింట్లను సాధించగా, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లను అందుకుంది. సఫారీలో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ప్రామాణికంగా వస్తుంది. ఈ కారు ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

టాటా హారియర్ :
కొత్త టాటా హారియర్, టాటా సఫారీలు (OMEGARC) ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. ల్యాండ్ రోవర్ డీ8 ప్లాట్‌ఫారమ్ నుంచి వచ్చింది. ఈ రెండు ఎస్‌యూవీలు గ్లోబల్ ఎన్‌సీఏపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలలో ఒకే విధమైన స్టార్‌లు, పాయింట్లను సాధించాయి. ఈ రెండు కారు మోడల్స్ భారత్ ఎన్‌సీఏపీ వద్ద కూడా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. టాటా హారియర్ కారు ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.44 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ :
కొత్త టాటా నెక్సాన్ స్వదేశీ మార్కెట్ నుంచి వచ్చిన మరో ఎస్‌యూవీ మోడల్. గ్లోబల్ ఎన్‌సిఎపిలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటిలోనూ 5 స్టార్ స్కోర్ చేసింది. గతంలో 32.22 పాయింట్లు, 44.52 పాయింట్లను సాధించింది. నెక్సాన్ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ స్టాండర్డ్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ. 8.15 లక్షలతో మొదలై రూ. 15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ టైగన్ :
వోక్స్‌వ్యాగన్ టైగన్ గ్లోబల్ ఎన్‌సీఎపీలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలు రెండింటికీ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 29.64 పాయింట్లను సంపాదించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 42 పాయింట్లను పొందింది. సఫారీ, హారియర్, నెక్సాన్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ స్టాండర్డ్‌గా ఉండగా, టైగన్ ఈఎస్‌సీతో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లను మాత్రమే ప్రామాణికంగా కలిగి ఉంది. టైగన్ ధర రూ. 11.70 లక్షల నుంచి రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది.

స్కోడా కుషాక్ :
గ్లోబల్ ఎన్‌సీఏపీలో వోక్స్‌వ్యాగన్ టైగన్ రేటింగ్‌లకు సమానంగా స్కోడా కుషాక్ రేటింగ్‌లను కలిగి ఉంది. భారత్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా రెండూ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ (MQB-AO-IN) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. కుషాక్ ధర రూ. 11.89 లక్షల నుంచి రూ. 20.49 లక్షల (ఎక్స్-షోరూమ్)లో వస్తుంది.

Read Also : Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!