Airtel offering unlimited 5G data without daily data cap, here is how to claim the offer
Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎయిర్‌టెల్ 5G (Airtel 5G) నెట్‌వర్క్ ఇప్పుడు 3వేల భారతీయ పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus)గా పిలిచే ఐదవ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని గత ఏడాదిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ఆవిష్కరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5G కనెక్టివిటీని అందిస్తున్న రిలయన్స్ జియో (Reliance Jio)తో పాటు ఎయిర్‌టెల్ 5G సర్వీసులను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు జమ్మూలోని కత్రా నుంచి కేరళలోని కన్నూర్ వరకు, బీహార్‌లోని పాట్నా నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్ నుంచి కేంద్రపాలిత ప్రాంతం డామన్ నుంచి డయ్యూ వరకు దేశంలోని అన్ని కీలక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ యూజర్లు 5G సపోర్టు స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఈ కొత్త నెట్‌వర్క్‌కు వెంటనే కనెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ 5Gని అందిస్తోంది.
అయితే, ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఫ్రీగా అన్‌లిమిటెడ్ 5G నెట్‌వర్క్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ పొందాలంటే (Airtel Thanks) యాప్‌ని కూడా విజిట్ చేయాలి. లేదంటే తమ రీఛార్జ్ ప్లాన్‌లో డేటా ప్యాక్ లిమిటెడ్ 5G డేటాను మాత్రమే పొందుతారని గమనించాలి. మీరు ఎయిర్‌టెల్ 5G యాక్సెస్‌ని కలిగి ఉంటే.. అన్‌లిమిటెడ్ 5Gని పొందవచ్చు.
Airtel offering unlimited 5G data without daily data cap, here is how to claim the offer
అన్‌లిమిటెడ్ ఎయిర్‌టెల్ 5G డేటాను ఎలా పొందాలంటే? :
ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను పొందాలంటే.. రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ని పొందాల్సి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేయండి. మీకు యాప్ లేకపోతే.. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా (Apple App Store) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ హోమ్ స్క్రీన్‌పై, ‘మీ అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. మీకు కనిపించే బ్యానర్ Tap చేయండి.
మీరు ఆఫర్ వివరాలను, నిబంధనలు, షరతుల పేజీకి రీడైరెక్ట్ అవుతారు. ‘Claim Now’పై ఆప్షన్ Tap చేయండి. ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసిన తర్వాత మీకు ‘అభినందనలు.. అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్ మీ సొంతం అనే మెసేజ్ పొందుతారు. ఇప్పుడు మీ రీఛార్జ్ వ్యాలిడిటీ వ్యవధిపై మీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నంబర్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. 5G డేటా బ్యాలెన్స్‌ని చెక్ చేయాలంటే.. యాప్‌లోని ‘My Account’ సెక్షన్‌కు వెళ్లండి. ‘Data Balance’పై Tap చేయండి. మీ నంబర్‌కు అందుబాటులో ఉన్న 5G డేటా మొత్తాన్ని చూడవచ్చు.