Airtel Fiber Plans : జియో ఫైబర్‌కు పోటీగా.. కేవలం రూ.199కే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్.. ఫ్రీ రూటర్ కూడా.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Airtel Fiber Plans : కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? జియో ఫైబర్ (Jio Fiber)కు పోటీగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199లకే ఫైబర్ ప్లాన్ తీసుకోవచ్చు.

Airtel Fiber Plans : జియో ఫైబర్‌కు పోటీగా.. కేవలం రూ.199కే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్.. ఫ్రీ రూటర్ కూడా.. మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Airtel Launches Broadband Standby Plans Starting at Rs 199 with Free Router,

Updated On : April 29, 2023 / 9:36 PM IST

Airtel Fiber Plans : భారత ప్రముఖ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) అందించే హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ (Airtel Xstream Fiber) కనెక్షన్.. 1Gbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 10Mbps స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటాతో బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్‌ల పేరుతో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్‌ వివరాలను ఓసారి చూద్దాం..

ఎయిర్‌టెల్ రూ. 199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ :
ఎయిర్‌టెల్ (Airtel) అందించే రూ.199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ యూజర్లకు 10 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఈ ఎంట్రీ-లెవల్ 10 Mbps ప్లాన్‌ను 5 నెలల వ్యవధిలో ఎంచుకోవచ్చు. రూ. 500 వన్-టైమ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, GSTతో సహా మొత్తం ధర రూ. 1,674 వద్ద ఫ్రీగా Wi-Fi రూటర్‌తో వస్తుంది.

Read Also : Upcoming Smartphones : మే 2023లో రాబోయే 5 కొత్త స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఏయే బ్రాండ్ల ఫోన్లు ఉండొచ్చుంటే? ఫుల్ లిస్టు మీకోసం..!

ఎయిర్‌టెల్ రూ. 399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ :
ఎయిర్‌టెల్ (Airtel) స్టాండ్‌బై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 399కు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 10 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఉచితంగా Wi-Fi రూటర్, Xstream బాక్స్ అందిస్తుంది. 350+ టీవీ ఛానెల్‌లను కూడా ఆఫర్ చేస్తుంది. రూ. 500తో GST వన్-టైమ్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలతో సహా మొత్తం 5 నెలల కాలానికి ధర రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. రెండు బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్‌లలోని ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యూజర్లు కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లలో ఏ సమయంలోనైనా తమ ప్లాన్ స్పీడ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Airtel Launches Broadband Standby Plans Starting at Rs 199 with Free Router,

Airtel Fiber Plans : Airtel Launches Broadband Standby Plans Starting at Rs 199 with Free Router,

ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఎంట్రీ-లెవల్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఎంట్రీ-లెవల్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్ (Basic) ఆఫర్ రూ. 499 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్‌పై 40 Mbps వద్ద అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్‌ని ఉపయోగించి అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, STD కాల్‌లను అందిస్తుంది. (Airtel Thanks) బెనిఫిట్‌లను కూడా అందిస్తుంది. అదనంగా, ఎయిర్‌టెల్ కస్టమర్‌లు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లతో ఒక ఏడాది ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ (Wink Music) వంటి మరిన్నింటిని పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో పాటు ఉచిత Wi-Fi రూటర్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్‌లు వినియోగదారులకు 10 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అలాగే, ఉచితంగా Wi-Fi రూటర్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తాయి. డిసెంబర్ 31, 2022 నాటికి, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు 1,140 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ విస్తరణ ప్రణాళికలలో భాగంగా త్వరలో కొత్త నగరాల్లోనూ అందుబాటులోకి రానుంది. మీ ప్రాంతంలో (Airtel Xstream) ఫైబర్ సర్వీసులను కలిగి ఉన్నట్లయితే.. ఎయిర్‌టెల్ ఫైబర్ ప్లాన్లలో 5 నెలల ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.

Read Also : Realme 11 Pro+ Launch : రియల్‌మి 11ప్రో ప్లస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?