Airtel New Prepaid Plan : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. అదిరే డేటా బెనిఫిట్స్.. 30రోజుల వ్యాలిడిటీ..!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది.

Airtel 265 Prepaid Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.265 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ ఇప్పుడు మరింత వ్యాలిడిటీతో వస్తుంది. అదే ధరలో మరిన్ని డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ ఇంతకుముందు రూ. 200 లోపు 4 కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఎక్కువ ఛార్జీలు లేకుండా యూజర్లకు అందిస్తుంది. టెలికం కంపెనీలు కొన్ని డేటా బెనిఫిట్స్‌తో పాటు యూజర్లకు టాక్‌టైమ్‌ను అందించే ప్లాన్లపైనే ఎక్కువగా దృష్టి సారించాయి. ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధర రూ. 109, రూ. 131, రూ. 109, రూ. 111, రూ. 265 ప్రీపెయిడ్ ప్లాన్‌.. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడీటీతో వచ్చాయి. కానీ, ఇప్పుడు రూ. 265 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజులకు పొడిగించింది. ప్లాన్ రోజువారీ బెనిఫిట్స్ కూడా పెరిగాయి.

Airtel Rs 265 Prepaid Plan Now Offers More Data, Comes With A Validity Of 30 Days

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ గతంలో 1GB డేటా బెనిఫిట్స్ అందించింది. కానీ, ఇప్పుడు రోజువారీ బెనిఫిట్స్ రోజుకు 1.5GB డేటాకు పెరిగాయి. మీరు రూ. 300లోపు ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. రూ. 265 ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ మీకు మెరుగైన డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. దాదాపు నెల పాటు కొనసాగుతుంది. చాలా ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీని అందించవు. మీరు ప్రతి 28 రోజుల తర్వాత మీ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. TRAI ఇటీవలి ఆదేశాల తర్వాత టెలికాం ఆపరేటర్లు కనీసం ఒక ప్లాన్‌ను 30 రోజుల వ్యాలిడిటీతో నెలవారీ రెన్యువల్ ప్లాన్‌ను ప్రతి నెలా అదే తేదీన రెన్యువల్ చేసుకునేందుకు అనుమతినిచ్చాయి.

Airtel రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 25GB 4G హై-స్పీడ్ డేటాతో వస్తుంది. దీని తర్వాత యూజర్లకు MBకి 50 పైసలు ఛార్జ్ అవుతుంది. ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. రోజువారీ 100SMS లిమిట్ ముగిసిన తర్వాత.. యూజర్లు ప్రతి స్థానిక SMSకి 1, STD SMSకి రూ. 1.5 ఛార్జ్ అవుతుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30-రోజుల ఉచిత ట్రయల్, 3-నెలల అపోలో 24/7 సర్కిల్, షా అకాడమీ క్లాస్‌తో అప్‌స్కిల్స్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్‌లను అందిస్తుంది. 30 రోజుల ఖచ్చితమైన వ్యాలిడిటీని అందిస్తుంది.

Read Also : Nokia C21 Plus : కొత్త నోకియా C21 ప్లస్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు