Nokia C21 Plus : కొత్త నోకియా C21 ప్లస్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా C21 అనేది ఎంట్రీ-లెవల్ ఫోన్.. ఈ C21 ప్లస్‌తో పాటు, నోకియా ప్రపంచవ్యాప్తంగా నోకియా T10 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను కూడా లాంచ్ చేసింది.

Nokia C21 Plus : కొత్త నోకియా C21 ప్లస్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Nokia C21 Plus Launched In India, Price Starts At Rs 10,299 (1)

Nokia C21 Plus : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా భారత్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా C21 అనేది ఎంట్రీ-లెవల్ ఫోన్.. ఈ C21 ప్లస్‌తో పాటు, నోకియా ప్రపంచవ్యాప్తంగా నోకియా T10 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ బడ్జెట్ కేటగిరీలోనూ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాలిటీ, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

HMD గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ కొచ్చర్ మాట్లాడుతూ.. మా యూజర్లకు నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించేందుకు C-సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. అందులో భాగంగానే నోకియా C21 ప్లస్‌ను అందిస్తున్నాం. HMD గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యూజర్ల అవసరాలను తగినట్టుగా డైనమిక్‌గా గుర్తిస్తోంది. బ్యాటరీ లైఫ్, స్టోరేజ్ కెపాసిటీ, డిజైన్, కెమెరా క్వాలిటీ వంటి ఫీచర్లతో అందిస్తోంది. Nokia C21 Plus అదే ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. వచ్చే ఈ కొత్త ఎడిషన్ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్టు ఆయన తెలిపారు.

నోకియా C21 ప్లస్ : ధర ఎంతంటే? :
నోకియా C21 ప్లస్ 3GB+32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,299కి లాంచ్ అయింది. 4GB+ 64GB వేరియంట్ ధర రూ.11,299గా ఉంది. నోకియా C21 ప్లస్‌తో పాటు ఫ్రీగా వైర్ బడ్స్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు. స్మార్ట్‌ఫోన్ అతి త్వరలో రిటైల్ ఛానెల్‌లు, ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.

Nokia C21 Plus Launched In India, Price Starts At Rs 10,299

Nokia C21 Plus Launched In India, Price Starts At Rs 10,299

Nokia C21 Plus : స్పెసిఫికేషన్‌లు
నోకియా C21 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను 20:9 యాస్పెక్ట్ రేషియోతో అందించింది. దీని ధరకు అనుగుణంగా, స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ Unisoc SC9863A ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB స్టోరేజీతో వచ్చింది. Nokia C21 Plus Android 11 Go ఎడిషన్‌పై రన్ అవుతుంది. కెమెరా విభాగంలో.. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 13-MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 5-MP కెమెరా ఉంది.

నోకియా T10 ఆండ్రాయిడ్ టాబ్లెట్ :
నోకియా T10 ఆండ్రాయిడ్ టాబ్లెట్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. నోకియా ఇంకా భారత మార్కెట్లో లాంచ్ కాలేదు. 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ టాబ్లెట్ ధర £129 (దాదాపు రూ. 12,158)గా ఉంది. LTE వేరియంట్ ధర £149 (దాదాపు రూ. 14,044)గా ఉంది. వచ్చే నెల నుంచి ఈ టాబ్లెట్ యూకేలో అందుబాటులోకి రానుంది. Nokia T10 60hz రిఫ్రెష్ రేట్‌తో 8-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. 3 ఏళ్ల సెక్యూరిటీ సపోర్టును అందిస్తోంది.

Read Also :  iOS 16 public Beta : ఆపిల్ iOS 16 పబ్లిక్ బీటా రిలీజ్.. మీ ఐఫోన్లో ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు!