Airtel : ఎయిర్‌టెల్ ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్
టెలికాం రంగంలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ రంగంలో ఎయిర్ టెల్ దూసుకపోతోంది. కస్టమర్ల భధ్రత కోసం కాస్పర్ స్కైతో జత కట్టింది.

Airtel To Launch Office Internet Plan
Airtel Office Iinternet Plan : టెలికాం రంగంలో ఉన్న కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ రంగంలో ఎయిర్ టెల్ దూసుకపోతోంది. కస్టమర్ల భధ్రత కోసం కాస్పర్ స్కైతో జత కట్టింది. తాజాగా మరిన్ని ఐటీ కంపెనీలతో చేతులు కలుపనుంది.
గూగుల్, క్లౌడ్, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ఎయిర్ టెల్ ఆఫీసు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. చిన్న వ్యాపారాల సంస్థల కోసం, టెక్ స్టార్టప్ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఎకీకృత ఎంటర్ ప్రైజ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించబోతున్నట్లు ఎయిర్ టెల్ కంపెనీ వెల్లడించింది.
ఎయిర్ టెల్ ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్ ధరలు రూ. 900 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎయిర్ టెల్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్ ఆన్ సేవలను పొందవచ్చు. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ చేసుకోవడానికి ఎయిర్ టెల్ ఆఫీసు ఇంటర్నెట్ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ ఛైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడించారు. వన్ ప్లాన్, వన్ బిల్ తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తుందని తెలిపారు.
ఆఫీసు ఇంటర్నెట్ ప్లాన్ లో భాగంగా…అపరిమిత లోకల్ / STD కాలింగ్ తో పాటు…1 GBPS వరకు అధిక వేగంతో FTTH బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందివ్వనుంది. గూగుల్ వర్క్ స్పేస్, డీఎన్ఎన్ సెక్యూర్టీ బై సిస్కో, ప్రీ ప్యారలర్ రింగింగ్ సర్వీసులను ఎయిర్ టెల్ అందిస్తోంది.