Amazon Flipkart Holi Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 10ప్రో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్..!

Amazon Flipkart Holi Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ హోలీ సేల్ కొద్దిగంట్లో ముగియనుంది. మార్చి 8వరకు ఈ హోలీ సేల్ అందుబాటులో ఉంటుంది.

Amazon Flipkart Holi Sale : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 10ప్రో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్..!

Amazon and Flipkart Holi Sale _ Discounts on iPhone 13, OnePlus 10 Pro, AirPods, And More

Updated On : March 7, 2023 / 11:17 PM IST

Amazon Flipkart Holi Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ హోలీ సేల్ (Flipkart Holi Sale) కొద్దిగంట్లో ముగియనుంది. మార్చి 8వరకు ఈ హోలీ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ఆపిల్ iPhone 13, Pixel 6a, OnePlus 10 Pro వంటి పాపులర్ డివైజ్‌లపై Amazon, Flipkart ద్వారా తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. Oppo Enco X2, AirPodలు వంటి TWS ఇయర్‌ఫోన్‌లపై భారీ డీల్స్ పొందవచ్చు. మీ బడ్జెట్‌ను బట్టి బెస్ట్ డీల్స్ ఇలా పొందవచ్చు.

ఆపిల్ (iPhone 13) మళ్లీ అమ్మకానికి వచ్చింది. (Flipkart) ద్వారా రూ. 60,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే, అమెజాన్ ద్వారా అదే డివైజ్ రూ. 60,900కి పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,500 వరకు తగ్గింపు కూడా ఉంది. అలాగే, EMI లావాదేవీలపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అదనంగా రూ.2వేల డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ అధికారికంగా ఐఫోన్ 13 మోడల్ రూ.69,900 ప్రారంభ ధరతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : Hyundai Alcazar 2023 Launch : అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో హ్యుందాయ్ అల్కాజార్ 2023 వచ్చేసిందోచ్.. సూపర్ మైలేజ్, ఏ వేరియంట్ ధర ఎంతంటే?

ఈ-కామర్స్ సైట్‌లపై దాదాపు రూ. 8,900 తగ్గింపును పొందవచ్చు. గతంలో రూ. 30వేల కన్నా ఎక్కువ ధరకు ఉన్న Pixel 6a ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు మరికొన్ని రోజులు వేచి ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) సమయంలో ఈ పిక్సెల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఈ సేల్ మార్చి 11న ప్రారంభమవుతుంది. కొన్ని Pixel-ప్రత్యేకమైన ఫీచర్‌లతో బెస్ట్ కెమెరా, క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలనుకునే వారికి బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు.

Amazon and Flipkart Holi Sale _ Discounts on iPhone 13, OnePlus 10 Pro, AirPods, And More

Amazon and Flipkart Holi Sale _ Discounts on iPhone 13, OnePlus 10 Pro

ఇదే ధర పరిధిలో ఇతర ఆప్షన్లలో నథింగ్ ఫోన్ (1) ఫోన్, iQOO Neo 7 ధర రూ. 30వేల కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. నథింగ్ ఫోన్ మీకు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999లకు అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా iQOO ఫోన్ ధర రూ. 28,499కి అందుబాటులో ఉంటుంది. OnePlus 10 Pro స్మార్ట్‌ఫోన్‌ను రూ. 61,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. అసలు ధర రూ. 66,999 నుంచి తగ్గింది. ఈ 5G ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై అమెజాన్ రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌ల విషయానికొస్తే.. సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను రూ. 10,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ మొదట ఈ ఎయిర్‌పాడ్‌లను రూ.14,900 ధరతో ప్రకటించింది. అమెజాన్‌లో కస్టమర్లు రూ.3,901 తగ్గింపును పొందవచ్చు. సరసమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కోరుకునే యూజర్లు Oppo Enco X2 ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మీకు చాలా మంచి సౌండ్ క్వాలిటీని పొందాలంటే.. కాల్‌ల కోసం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)ని అందిస్తుంది. దేశంలో రూ. 10,999కి లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం దీనిని రూ.9,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. భారత మార్కెట్లో రూ.14,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. Jabra Elite 5 ఫోన్ ప్రస్తుతం హోలీ సేల్‌లో భాగంగా అమెజాన్ ద్వారా రూ.11,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.4వేల డిస్కౌంట్ పొందవచ్చు. జాబ్రా ఇయర్‌బడ్‌లు బ్యాలెన్స్‌డ్ సౌండ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ లైఫ్‌ పొందవచ్చు.

Read Also : iPhone 14 Plus Launch India : కొత్త ఎల్లో కలర్ ఆప్షన్లతో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ వేరియంట్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతంటే?