Amazon : ప్రొడక్టులను కాపీ చేసి..ప్రమోట్ చేస్తోందా ? రాయిటర్స్ సంచలన కథనం

భారత్ లో లోకల్ బ్రాండ్ లను సైతం వదలకుండా...కాపీ కొడుతోందని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.

Amazon – Reuters : పోటీ ప్రపంచంలో లాభాలే ధ్యేయంగా కొన్ని కంపెనీలు పని చేస్తుంటాయి. సదరు కంపెనీలకు ధీటుగా మార్కెట్ లో దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటాయి సంస్థలు. ఒక కంపెనీ మార్కెట్ లో ఏదైనా వస్తువు రిలీజ్ చేస్తే..దానికి ధీటుగా..మరికొన్ని ఫీచర్స్ జత చేసి వస్తువులను మార్కెట్ లో విడుదల చేస్తుంటాయి. ఈ కామర్స్ లో దిగ్గజ కంపెనీ అయిన..‘అమెజాన్’ కూడా ప్రొడక్టులను మార్కెట్ లో విడుదల చేస్తోంది. కానీ..ఈ కంపెనీ మార్కెటింగ్ లో దిగజారి ప్రవర్తిస్తోందని, ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి..విడుదల చేస్తోందన వార్త హల్ చల్ చేస్తోంది.

Read More : Distant red stars signals : 19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసులు ఇచ్చిన సంకేతాలా?

దీనిపై రాయిటర్స్ ఓ సంచలన కథనం ప్రచురించింది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ndia Private Brands Programme పేరిట సేకరించిన పత్రాల వివరాలను రాయిటర్స్ వెల్లడించింది. ఇందులో సంచలనాత్మకమైన కథనాలు ఉన్నాయి. భారత్ లో మార్కెటింగ్ విషయంలో దిగజారి ప్రవర్తిస్తుందని రాయిటర్స్ ఆరోపిస్తోంది. వివిధ దేశాలకు సంబంధించి…అమెజాన్ అనుసరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీని వెల్లడించింది. ఇతర బ్రాండ్ ప్రొడక్టులను కాపీ చేసి…తయారు చేసి..వాటిని ప్రమోట్ చేయడంలో అమెజాన్ మొట్టమొదటి ప్రియార్టీ ఇస్తోందని వెల్లడిస్తోంది.

Read More : China : చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలు అరెస్ట్‌

భారత్ లో లోకల్ బ్రాండ్ లను సైతం వదలకుండా…కాపీ కొడుతోందని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ విషయాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ దృష్టికి సైతం వెళ్లినట్లు రూటర్స్ కథనం వెలువరించింది. అమెజాన్ ట్రిక్ మార్కెటింగ్ కు ఎక్కువ బలైంది కిషోర్ బియానీ ఆధ్వర్యంలోని జాన్ మిల్లర్ అని తెలిపింది. టాప్ ప్రయారీటీ ఉన్న బ్రాండ్ లను వినియోగదారులకు టాప్ సె ర్చ్ లో చూపిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం రాయిటర్స్ చేసిన ఆరోపణలపై అమెజాన్ ఎలా స్పందిస్తుందో వెయిట్ అండ సీ.

ట్రెండింగ్ వార్తలు