China : చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలు అరెస్ట్‌

చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై క్రిమినల్స్ కేసులు పెట్టి నిర్భంధిస్తున్నారు చైనా పోలీసులు.

China : చైనాలో వాట్సాప్‌, మెయిల్స్ వాడినందుకు ముస్లిం మహిళలు అరెస్ట్‌

China Mislim Womens

China Detained Muslim Women For Using WhatsApp :  చైనాలో ముస్లింలపై దారుణాలు జరుగుతున్నాయని కొంతకాలం నుంచి వినిపిస్తున్న మాట. కానీ అటువంటివేమీ లేవని చైనా ప్రభుత్వం చెబుతోంది. కానీ తాజాగా జరిగిన ఓ పరిణామంతో అవి కేవలం ఆరోపణలు కావనీ నిజాలేనని నిరూపితమైంది.చైనాలో ముస్లింలపై జరుగుతున్న దురాగతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం మాత్రం వాటిని తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ఈక్రమంలో వాట్సాప్‌, జీ మెయిల్‌ వాడుతున్న ముస్లిం మహిళలను చైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు వెల్లడైంది. గత కొన్ని నెలలుగా ఇటువంటి ఘనటనలు జరుగుతున్నాయని తేలింది. వాట్సాప్, మెయిల్స్ వాడే  మహిళలపై  ప్రీ-క్రిమినల్స్‌గా ముద్ర వేసి, రీ-ఎడ్యుకేషన్ క్లాస్‌కు పంపిస్తోంది. ఈ శిబిరాల్లో కొన్ని నెలలు ఉంచిన తర్వాత, కొన్ని షరతులు విధించి విడుదల చేస్తారు. స్థానిక పరిసరాల్లోనే ఉండాలని, రెగ్యులర్‌గా సోషల్ స్టెబిలిటీ వర్కర్‌ను కలవాలని చెబుతారు.

Read more: చైనాలో ముస్లిం మహిళలకు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు..అబార్షన్లు

ఈ వివరాలు ‘ఇన్‌ ది క్యాంపస్‌ చైనా హై-టెక్‌ పె నాల్‌ కాలనీ’ అనే పుస్తకంలో ఉన్నాయి. ఓ మహిళ వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నందుకే చైనా పోలీసులు అరెస్టు చేశారని ఈ పుస్తకం వెల్లడించింది. మరో మహిళ తన ఐడీ నంబర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవడానికి అనుమతించిందన్న కారణంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఈ పుస్తకం ప్రకారం..జౌ అనే మహిళ మాత్రమే కాదు..మరో 11 మంది ముస్లిం మహిళలను అదుపులోకి తీసుకుని వారిపై క్రిమినల్స్అనే ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.

చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఇటువంటి ఆంక్షలు కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో దాదాపు 10 లక్షల మంది వీగర్లు, ఇతర ముస్లిం వర్గాలవారు క్యాంపులలో మగ్గిపోతున్నట్లు మానవ హక్కుల డేటా చెబుతోంది. ఈ క్యాంపులలో ఉండేవారి చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇది చాలదన్నట్లు కొన్ని నెలలుగా యాప్‌లపై నిఘా పెట్టింది జిన్‌పింగ్‌ సర్కార్‌. అది కూడా కేవలం ముస్లిం మహిళలపైనా పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. క్యాంప్‌ల పేరుతో మైనారిటీలైనా ముస్లింలను చిత్రహింసలకు గురిచేస్తోంది చైనా. ముస్లిం మహిళల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా డ్రాగన్ కంట్రీ మాత్రం ఇవేమీ పట్టించుకోవటంలేదు.

కాగా..చైనా ముస్లిం మైనారిటీల జనాభాను తగ్గించటానికి బలవంతపు కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టిందనీ..ఉయ్‌ఘర్‌ ముస్లింల జనాభాను తగ్గించేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయ్‌ఘర్‌ జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ మతానికి చెందిన మహిళల్ని టార్గెట్ చేసిన చైనా ప్రభుత్వం ఇద్దరు, ముగ్గురుపిల్లలకు కంటే ఎక్కువున్నవారికి ఇష్టం లేకున్నా..బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తోందని..పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని..లేదంటే సంతాన నిరోధక పరికరాలు(IUD) వాడాలని చైనా ప్రభుత్వం ఉయ్ ఘుర్ మహిళలపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది.