Amazon Festival Sale: మైండ్ బ్లోయింగ్.. ఏంటయ్యా ఈ ఆఫర్లు.. షావోమీ 14 సీవీ ఎంతకు వస్తుందో తెలుసా?
షావోమీ 14 సీవీ భారత్‌లో విడుదలైనప్పుడు దీని ధర ఏకంగా రూ.42,999. ప్రస్తుతం అమెజాన్‌లో ఎంతంటే?

Xiaomi 14 Civi
Amazon Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025లో అనేక రకాల వస్తువులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులు వంటివి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.
ఈ సేల్‌లో అత్యుత్తమ ఆఫర్లలో షావోమీ 14 సీవీ ఒకటి. ప్రత్యేకమైన డిజైన్, అద్భుతమైన డిస్ప్లే, శక్తిమంతమైన పనితీరు, మంచి కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ అందరినీ ఆకర్షిస్తోంది. షావోమీ 14 సీవీ ఆఫర్ వివరాలు తెలుసుకోండి. (Amazon Festival Sale)
షావోమీ 14 సీవీ ధర
షావోమీ 14 సీవీ భారత్‌లో విడుదలైనప్పుడు దీని ధర రూ.42,999. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999. అంటే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా అమెజాన్ రూ.17,000 తగ్గింపు అందిస్తోంది. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఇంకా ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.
షావోమీ 14 సీవీ 6.55 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చింది. దీని గరిష్ఠ బ్రైట్‌నెస్ 3000 నిట్స్, రిఫ్రెష్ రేట్ గరిష్ఠంగా 120 హెర్ట్జ్. అదనంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ, హెచ్‌డీఆర్10+, డాల్బీ విజన్, 68-బిట్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం షావోమీ 14 సీవీ బ్యాక్ సైడ్ 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.
ఇందులో 12 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2 ఎక్స్ ఆప్టికల్ జూమ్ 50 ఎంపీ టెలిఫొటో సెన్సార్, పీడీఏఎఫ్ (ఫేజ్ డిటెక్షన్ ఆటో ఫోకస్), ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ రెండు 32 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.