Amazon : అమెజాన్‌లో ఆఫర్ల ఫెస్టివల్

ఆగస్టు 15వ తేదీని పురస్కరించుకుని...‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 05వ తేదీ నుంచి..ఆగస్టు 09వ తేదీ వరకు మాత్రమే ఈ సేల్ ఉంటుందని సంస్థ వెల్లడించింది.

Amazon : అమెజాన్‌లో ఆఫర్ల ఫెస్టివల్

Amazon

Updated On : August 5, 2021 / 3:48 PM IST

Great freedom festival 5th 9th august : అమెజాన్ లో ఆఫర్ల ఫెస్టివల్ ప్రారంభమైంది. పండుగలు, ముఖ్యమైన రోజుల్లో అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఆగస్టు 15వ తేదీని పురస్కరించుకుని…‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టు 05వ తేదీ నుంచి..ఆగస్టు 09వ తేదీ వరకు మాత్రమే ఈ సేల్ ఉంటుందని సంస్థ వెల్లడించింది.

Read More : Viral Video : లైవ్ కవరేజ్ కోసమని వెళితే కారు మునిగే దృశ్యాలు…వైరల్ గా మారిన వీడియో

జులై నెలలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే..ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ గాడ్జెట్స్ తో పాటు…ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. కస్టమర్లకు ఆఫర్లు అందించేందుకు అమెజాన్ SBIతో టై అప్ అయ్యింది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సేల్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే…(గరిష్టంగా రూ. 1750) కొనుగోలు చేస్తే…10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఆఫర్లను కూడా సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు : –

Read More : Cat In Baseball Game : ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ లోకి అనుకోని అతిథి

ఆపిల్ ఐ ఫోన్ 12
రూ. 79 వేల 900 విలువైన ఆపిల్ ఐ ఫోన్ 12 ఆఫర్ లో భాగంగా 11 వేల 901 తగ్గుతుంది. స్మార్ట్ ఫోన్ ఉంటే..ఎక్స్చైంజ్ ఆఫర్ లో రూ. 13 వేల 400 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక వీటితో పాటు వన్ ప్లస్ 9 జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Read More : Whatsapp Nude Video : వాట్సాప్‌లో నూడ్‌గా యువతి… ఆ తర్వాత..
అమెజాన్ బ్రాండ్లపై ఆఫర్లు : –
అమెజాన్ సంస్థకు చెందిన డివైజ్ ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే ఈ బుక్ రీడర్స్ ఆఫర్లు లభిస్తాయి. ఆపిల్‌ ఎయిర్‌ పాడ్స్‌ ప్రో, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌, ఆపిల్‌ ఐపాడ్‌ ఎయిర్‌ 2020, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ, సోనీ డబ్ల్యూహెచ్‌ ఎక్స్‌ఎం3 వైర్‌ లెస్‌ హెడ్‌ ఫోన్‌ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. హెచ్‌ పీ పెవిలియన్ గేమింగ్‌ ల్యాప్‌ ట్యాప్‌లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు.

Read More : Aadhaar Card : వ్యక్తి మరణిస్తే అతని అధార్ కార్డును ఏంచేయాలో తెలుసా….

ఆపిల్ ఐ ఫోన్ 11 :-

ఆపిల్ ఐ ఫోన్ రూ. 49 వేల 999కే సొంతం చేసుకొవచ్చు. దీని ధర వాస్తవానికి రూ. 54 వేల 900. ఆఫర్ లో రూ. 4 వేల 500 తగ్గుతుంది. ఆమెజాన్ ఎక్స్చైంజ్ ఆఫర్ లో రూ. 13 వేల 400 తగ్గింపుతో ఐ ఫోన్ 11 కొనుక్కోవచ్చు. పేరొందిన క్రెడిట్ కార్డులను వినియోగిస్తే…నో కాస్ట్ EMI ఆప్షన్ లభించనుంది.