Amazon Festival Sale 2022 : స్మార్ట్‌వాచ్‌లపై టాప్ 5 డీల్స్ మీకోసం.. మరెన్నో డిస్కౌంట్లు.. ఏ బ్రాండ్ వాచ్ బెస్ట్ అంటే?
Amazon Festival Sale 2022 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఇప్పుడు వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా అన్నింటిపై ప్రత్యేకమైన డీల్‌లను పొందవచ్చు.

Amazon Great Indian Festival Sale 2022_ Top 5 deals on smartwatches
Amazon Festival Sale 2022 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ఇప్పుడు వినియోగదారులందరికి అందుబాటులోకి వచ్చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు వివిధ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా అన్నింటిపై ప్రత్యేకమైన డీల్‌లను పొందవచ్చు. అమెజాన్ బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ, AMOLED డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఏడాదిలో Amazon ఫెస్టివ్ సేల్ 8 రోజుల పాటు కొనసాగుతుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ల కోసం అమెజాన్ అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో క్యాష్ బ్యాక్ రివార్డ్‌ల కోసం కొనుగోలుదారులు అమెజాన్ వజ్రాలను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఈ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లలో SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. మీ బడ్జెట్ AMOLED డిస్‌ప్లేతో BT కాలింగ్ వంటి ఫీచర్‌లతో కూడిన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? అయితే ఇక్కడ మీకోసం బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Amazon Great Indian Festival Sale 2022_ Top 5 deals on smartwatches
Noise ColorFit Ultra 2 Buzz :
అమెజాన్ అందించే నాయిజ్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 Buzz డిస్కౌంట్ ధర రూ.6,999 కి బదులుగా రూ. 2,799 అందుబాటులో ఉంది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. BT కాలింగ్‌ను అందిస్తుంది. అంతేకాదు.. వాచ్ 368×448 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 100+ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఆటో డిటెక్షన్‌తో 100 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది.
boAt Xtend Pro :
బోట్ Xtend Pro రూ.9,799 కి బదులుగా రూ. 2,999 డిస్కౌంట్ ధరతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. BT కాలింగ్‌ను అందిస్తుంది. 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. రన్నింగ్ నుంచి 700 కంటే ఎక్కువ మోడ్‌లతో వస్తుంది. అదనంగా 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. boAt Xtend Pro ఒక మెటల్ పట్టీతో వస్తుంది.
Fire-Boltt Visionary :
Amazon ప్రకారం.. రూ. 17,999 నుండి తగ్గింపు తర్వాత ఫైర్-బోల్ట్ విజనరీ రూ. 3,79 9 ధరకు వస్తుంది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే 368×448 పిక్సెల్ రిజల్యూషన్, 100 కన్నా ఎక్కువ యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్, వాయిస్ అసిస్టెన్స్, BT కాలింగ్ సౌకర్యం మరిన్నింటిని కలిగి ఉంది. నీటి నిరోధకత, SpO2 సౌకర్యంతో వస్తుంది.

Amazon Great Indian Festival Sale 2022_ Top 5 deals on smartwatches
ZEBRONICS Iconic :
జీబ్రానిక్స్ ఐకానిక్ రూ.10,999కి బదులుగా రూ. 3,099 తగ్గింపు ధరతో వస్తుంది. 1.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే, BT కాలింగ్ ఫెసిలిటీ, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ‘ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే’ ఫీచర్, 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, మరిన్నింటిని కలిగి ఉంది.
TAGG Verve Connect Ultra :
TAGG Verve Connect Ultra ధర రూ. 9,999కి బదులుగా రూ. 3,299తో వస్తుంది. 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే, BT కాలింగ్, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, 120 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు, కాలిక్యులేటర్, ఇన్-బిల్ట్ గేమ్‌లను మరిన్నింటిని కలిగి ఉంది.