Amazon Festival Sale : అమెజాన్ ప్రైమ్ సేల్ మొదలైందోచ్.. ఈ ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కుద ధరకే పొందాలంటే?

Amazon Great Indian Festival sale : ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ బెస్ట్ డీల్ అందిస్తోంది. ప్రస్తుతం ఇదే అత్యంత సరసమైన ఐఫోన్ 13 అని చెప్పవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Festival Sale : అమెజాన్ ప్రైమ్ సేల్ మొదలైందోచ్.. ఈ ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కుద ధరకే పొందాలంటే?

Amazon Great Indian Festival sale_ iPhone 13 is listed

Updated On : September 26, 2024 / 3:47 PM IST

Amazon Great Indian Festival sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రైమ్ మెంబర్‌లకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ఇతర కస్టమర్లందరూ సెప్టెంబర్ 27న సేల్ డీల్‌లను పొందవచ్చు. అయితే, ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ వంటి ఫోన్లు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ బెస్ట్ డీల్ అందిస్తోంది. ప్రస్తుతం ఇదే అత్యంత సరసమైన ఐఫోన్ 13 అని చెప్పవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు లీక్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు ఉండొచ్చు..!

అమెజాన్ ఫెస్టివల్ సేల్ : ఐఫోన్ 13 ధర ఎంతంటే? :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 41,999తో జాబితా అయింది. ఈ ఐఫోన్ 13 అసలు ప్రారంభ ధర రూ. 59,600 నుంచి తగ్గింది.. అంటే.. కొనుగోలుదారులు రూ. 17,601 భారీ తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులకు ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. మీరు ఐఫోన్ 13ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ఎస్‌బిఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,250 అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. దాంతో ఐఫోన్ 13 ధర రూ.40,749కి తగ్గుతుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే వినియోగదారులు రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. ఈ ఐఫోన్ 13 ధర రూ. 40వేల కన్నా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. మరింత ఎక్కువ తగ్గింపుల కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను ఎంచుకోవచ్చు.

క్రోమా, విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 13 ధరలు :
ఐఫోన్ 13 కొనుగోలు చేసే కస్టమర్లు.. క్రోమా, విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి విభిన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 13 ధరను పరిశీలించవచ్చు. ప్రస్తుతం, క్రోమా ఐఫోన్ 13ని రూ. 49,900కి విక్రయిస్తోంది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ధరతో పోలిస్తే చాలా ఎక్కువ. అదేవిధంగా, విజయ్ సేల్స్ ఐఫోన్ 13ని 128జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.48,900 ధర ట్యాగ్‌తో అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ రెండూ కూడా ఈ ఐఫోన్‌ను రూ. 49,900కి విక్రయిస్తున్నాయి. అమెజాన్ వినియోగదారులకు భారీ తగ్గింపును ఇస్తోంది. ఈ డీల్ కొన్ని రోజుల తర్వాత ముగుస్తుందా లేదా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగే వరకు అందుబాటులో ఉంటుందా? అనేది ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్ గతంలో ఐఫోన్‌లపై భారీ తగ్గింపులను ప్రకటించింది.

Read Also : iPhone 15 Pro Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 15ప్రోపై ఏకంగా రూ.20వేలు డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?