Amazon Festival Sale 2023 : అసలే పండుగ సీజన్.. అమెజాన్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు!

Amazon Festival Sale 2023 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులను అందించనుంది. SBI కార్డ్ హోల్డర్లకు ఫ్లాట్ 10శాతం తగ్గింపు పొందవచ్చు.

Amazon Festival Sale 2023 : అసలే పండుగ సీజన్.. అమెజాన్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు!

Amazon Great Indian Festival Sale _ OnePlus 11, Galaxy S23 and others to get massive discounts

Updated On : September 27, 2023 / 8:10 PM IST

Amazon Festival Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 (Amazon Great Indian Festival Sale 2023) కోసం రెడీ అవుతోంది. అతి త్వరలోనే అమెజాన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది.

ప్రతి ఏడాది మాదిరిగానే, ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు (Amazon Prime Subscribers) సేల్‌కి ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. మెగా ఈవెంట్‌కు అమెజాన్ (Samsung, Intel)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పండుగ సందర్భంగా శాంసంగ్ ప్రొడక్టులు, Intel-ప్రాసెసర్ ఆధారిత కంప్యూటర్‌లపై అద్భుతమైన డీల్స్, మరెన్నో తగ్గింపులను పొందవచ్చు.

Read Also : Flipkart Big Billion Days : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25వేల లోపు ధరకే నథింగ్ ఫోన్ (1).. డోంట్ మిస్..!

బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
అమెజాన్ రాబోయే సేల్ నిర్దిష్ట వివరాలపై ఎలాంటి వివరాలను రివీల్ చేయలేదు. కానీ, (SBI) డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఫ్లాట్ 10 శాతం తగ్గింపు అందించనుంది. నివేదికల ప్రకారం.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 అక్టోబరు 10న ప్రారంభం కానుంది. సేల్ సమయంలో అనేక ప్రొడక్టులపై గణనీయమైన తగ్గింపులను అందిస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలు వంటి అత్యంత డిమాండ్ ఉన్న కేటగిరీలు ఉన్నాయి.

Amazon Great Indian Festival Sale

Amazon Festival Sale 2023

ఆపిల్ ఐఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు :
ఈ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై ధర తగ్గింపు అందించనుంది. టెక్ ఔత్సాహికులు OnePlus 11, Samsung Galaxy S23, Motorola Razr 40 Ultra వంటి డివైజ్‌లపై తగ్గింపు ధరలను పొందవచ్చు. ఆపిల్ (iPhone 13), iPhone 14 సిరీస్ మోడళ్లతో సహా (Apple) ప్రొడక్టుల రేంజ్‌పై డిస్కౌంట్‌లను ఆపిల్ అభిమానులను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ (Flipkart Big Billion Days Sale)కు కూడా సిద్ధమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన డీల్స్ ఇప్పటికే రివీల్ చేసింది.

Samsung Galaxy S21 FE, Realme 11 Pro+, Motorola Edge 40 వంటి డివైజ్‌లపై షాపర్లు ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ నిర్దిష్ట డీల్స్ ప్రారంభానికి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అక్టోబర్ 1 తేదీని నిర్ణయించింది. దాంతో ఆపిల్ ఔత్సాహికుల దృష్టిని మరింత ఆకర్షిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ తమ రాబోయే అమ్మకాలను వినియోగదారులకు అందించనున్నాయి. కొత్త గాడ్జెట్‌లు, గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశంగా చెప్పవచ్చు.

Read Also : Flipkart Big Billion Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Google Pixle 7 ఫోన్‌పై ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!