Amazon Prime Day Sale : జూలై 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

Amazon Prime Day Sale : రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ టాప్ స్మార్ట్‌ఫోన్‌లు, అమెజాన్ ప్రొడక్టులపై భారీ తగ్గింపును పొందవచ్చు.

Amazon Prime Day Sale : జూలై 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్.. టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!

Amazon Prime Day Sale on July 15 _ Top smartphones, Amazon products with big discounts

Updated On : July 1, 2023 / 6:41 PM IST

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15న ప్రారంభం కానుంది. ఈ 2 రోజుల ఈవెంట్‌లో భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో మరెన్నో ప్రొడక్టులను అందిస్తుంది. గత సేల్ ఈవెంట్‌ల మాదిరిగానే.. అమెజాన్ డిస్కౌంట్ ధరలలో డివైజ్‌లను క్రమంగా వెల్లడిస్తోంది. కచ్చితమైన ధరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

సాధారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తుంటాయి. మీరు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేస్తుంటే.. రూ. 20K, రూ. 30K, రూ.40K, రూ.50K కేటగిరీల్లో బెస్ట్ ఆప్షన్లను పొందవచ్చు. అదనంగా, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఆధారితమైన యాజమాన్య అమెజాన్ ఎకో ప్రొడక్టులపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also : Pink WhatsApp Scam : పింక్ వాట్సాప్ స్కామ్‌.. ఈ లింక్ క్లిక్ చేశారంటే మీ డబ్బులు కోల్పోతారు జాగ్రత్త..!

రియల్‌మి నార్జ్ N53 : రూ. 10వేల లోపు ఫోన్ బేస్ వేరియంట్ ఇప్పటికే రూ. 8,999కి అందుబాటులో ఉంది. కొంచెం ధర తగ్గే అవకాశం ఉంది. 6GB RAM, 128 GB స్టోరేజ్ ఆప్షన్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 10వేల లోపు ఉండాలి. ఈ ధర Narzo N53 90Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరాలు, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది.

Amazon Prime Day Sale on July 15 _ Top smartphones, Amazon products with big discounts

Amazon Prime Day Sale on July 15 _ Top smartphones, Amazon products with big discounts

రెడ్‌మి K50i 5G : రూ. 30వేల లోపు (Redmi K50i 5G) అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ప్రైమ్ డే సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్‌లు మినహా ధర దాదాపు రూ. 21వేల నుంచి రూ. 22వేల వరకు తగ్గవచ్చు. 64MP ISOCELL ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. ఇతర ఫీచర్లలో 144Hz డిస్ప్లే, 67W ఛార్జింగ్ ఉన్నాయి.

iQOO 11 : రూ. 50వేల లోపు కొత్త iQOO 11 ధర ప్రస్తుతం రూ. 54,999గా ఉంది. కానీ, ప్రైమ్ డే సేల్ సమయంలో ఆఫర్‌లతో ధరను రూ. 49,000కి తగ్గించవచ్చు. కొత్త Snapdragon 8 Gen 2 SoCతో కూడిన పవర్‌హౌస్ కలిగి ఉంది. ఈ ఫోన్ E6 AMOLED డిస్‌ప్లే, 256GB స్టోరేజీ, 120W ఫ్లాష్‌ఛార్జ్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది.

iPhone 14 : రూ. 60వేల లోపు ఐఫోన్ 14 మోడల్.. ప్రస్తుతం రూ. 66,999కి రిటైల్ అవుతుంది. కానీ ఆఫర్లతో ఐఫోన్ ధరను రూ. 60వేలకి తగ్గించవచ్చు. ఈ ఐఫోన్ 14 సిరీస్ iOS 17 అప్‌డేట్‌ని అందుకోనుంది. ఇదిలా ఉంటే.. (Amazon Echo), ఇతర ప్రొడక్టులపై 55 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది. 9W LED బల్బుతో కూడిన అమెజాన్ ఎకో డాట్ రూ. 6,598 నుంచి రూ. 2,399 తగ్గింపు అందిస్తుంది.

Read Also : WhatsApp Transfer Chats : క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా మీ ఫోన్‌లో వాట్సాప్ చాట్ ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..!