Amazon Republic Day Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెల 13 నుంచే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!
Amazon Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం కానుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.

Amazon Republic Day Sale
Amazon Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్ యాక్సెస్ చేయగలరు.
ఈ సేల్ ఈవెంట్ ఎంతకాలం కొనసాగుతుందనే వివరాలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి ప్రముఖ మిడ్ రేంజ్ ఫోన్ల నుంచి ఐక్యూ 13 వంటి ప్రీమియం ఫోన్‌ల వరకు అమెజాన్ అనేక పాపులర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also : UPI Payments : యూపీఐ వాడుతున్నారా? ఇంటర్నెట్ లేకుండా పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
అమెజాన్ ఇంకా అన్ని స్మార్ట్‌ఫోన్‌ల ధర వివరాలను వెల్లడించలేదు. అయితే, గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్‌లతో లభించే ఫోన్‌ల పేర్లను ధృవీకరించింది. ఇందులో వన్‌ప్లస్ 13, ఐఫోన్ 15, ఐక్యూ జెడ్9ఎస్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ 13ఆర్, పోకో ఎక్స్6, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్, పోకో ఎక్స్6 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ, రెడ్‌మి ఎ4 ఫోన్లు ఉన్నాయి.
అమెజాన్ వన్‌ప్లస్ 13 సేల్ ఆఫర్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ, ఇప్పుడే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ బ్రాండ్ అన్ని అధీకృత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది. వన్‌ప్లస్ 13 కొనుగోలుదారులు రూ. 5వేల బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది.

Amazon Republic Day Sale
వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ కొనుగోలుదారులు రూ. 3వేల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇప్పుడు, లాంచ్ ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ ప్రకటించిన అదే ఆఫర్లను అమెజాన్ డిస్‌ప్లే చేస్తుందో లేదో చూడాలి. వన్‌ప్లస్ 13 ఫోన్ రూ. 69,999 వద్ద లాంచ్ అయింది. అయితే, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ రూ. 42,999 ధరకు లాంచ్ అయింది.
అమెజాన్‌లో ఐఫోన్ 15 ధర రూ. 60వేల లోపు ఉండవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో అదే ఫోన్ రూ. 60,499 వద్ద జాబితా అయింది. ఈ ఫోన్ సేల్ ధర రూ. 60వేల కన్నా తక్కువగా ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ కూడా తగ్గింపును పొందుతుందో లేదో ప్రస్తుతానికి తెలియదు. తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే యూజర్లు విజయ్ సేల్స్‌పై డీల్‌లను చెక్ చేయవచ్చు. ఎందుకంటే.. భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
అమెజాన్ బేసిక్ ఐఫోన్ 16 మోడల్ ధర రూ. 73,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోరేజ్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.79,900 ఉండగా, రూ. 6,410 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రో బేస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,12,900కి జాబితా అయింది.
అసలు లాంచ్ ధర రూ. 1,19,900 నుంచి తగ్గింది. విజయ్ సేల్స్ ఎలాంటి బ్యాంక్ కార్డ్ ఆఫర్ లేదా ఇతర షరతులు లేకుండా రూ.7వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 16 ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 84,900గా అయింది. అధికారిక రిటైల్ ధర రూ. 89,900 నుంచి తగ్గింది. చివరగా, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ తగ్గింపు ధర రూ 1,37,900 వద్ద అమ్మకానికి ఉంది.