Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

గూగుల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ 12 కూల్ డైనమిక్ కలర్ ఫీచర్ వస్తోంది. ఇదో డైనమిక్ థిమింగ్ సిస్టమ్ అతి త్వరలో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి రానుంది.

Android 12 Feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ 12 కూల్ డైనమిక్ కలర్ ఫీచర్ వస్తోంది. ఇదో డైనమిక్ థిమింగ్ సిస్టమ్ అతి త్వరలో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల (Android smartphones)లోకి రాబోతోంది. అదే.. Android 12 Feature.. ఈ మేరకు గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఆండ్రాయిడ్ 12 ఫీచర్ Google కొత్త డైనమిక్ థీమింగ్ సిస్టమ్‌‌ను ప్రవేశపెట్టింది.

మీ ఫోన్‌లోని వాల్‌పేపర్ నుంచి వివిధ కలర్స్, సిస్టమ్ యాప్ UI ఎలిమెంట్‌లను ఎక్స్ ట్రాక్ట్ చేయడంలో సాయపడుతుంది. స్మార్ట్ ఫోన్లలోని OS మొత్తం కలర్ మోడ్ మారుతుంది. అందులో Settings, Icons, Quick Settings tiles సహా ఇతర Apps అన్ని కలర్ మోడ్ మార్చేస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త ఆండ్రాయిడ్ 12 కూల్ ఫీచర్ Google Pixel ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే.. ఈ కొత్త ఫీచర్ అతి త్వరలో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతోంది.

ఇప్పటికే గూగుల్ దిగ్గజం.. ఏయే బ్రాండ్ స్మార్ట్ ఫోన్లలో ఈ కొత్త ఆండ్రాయిడ్ 12 ఫీచర్ రాబోతుందో ప్రకటించింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ముందుగా Samsung, OnePlus, Oppo, Vivo, Realme, Xiaomi, Tecno వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఉన్నాయి. మీ స్మార్ట్‌ఫోన్లో ఆండ్రాయిడ్ 12 ఫీచర్ అందుబాటులోకి రాగానే Google మెటీరియల్ ఈ కీలక ఫీచర్‌ను అప్ డేట్ చేస్తుందని Google ప్రకటించింది. Samsung, Xiaomi స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు ఇప్పటికే తమ స్వంత వెర్షన్‌లను థీమ్ ఆప్షన్లతో యూజర్లకు అందిస్తున్నాయి.

OEMలలో మాత్రం ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ అన్ని Android స్మార్ట్‌ఫోన్‌లలో బాగా పనిచేస్తుందని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని Google తెలిపింది. ఏది ఏమైనా.. OEMలు వివిధ డివైజ్‌ల్లో రన్ చేసినప్పుడు డైనమిక్ కలర్ థీమ్ భిన్నంగా కనిపిస్తుంది.

చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలో ఆండ్రాయిడ్ 12 కూల్ డైనమిక్ థీమింగ్ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, రాబోయే రెండు నెలల్లో మరిన్ని Android 12 డివైజ్‌ల్లోకి అందుబాటులోకి రానుందని ఆండ్రాయిడ్‌లో ప్రొడక్ట్ మేనేజర్ రోహన్ షా బ్లాగ్‌లో తెలిపారు. మీరు Google Pixel ఫోన్‌ వాడుతున్నట్టయితే.. మీరు వెంటనే ఈ ఫీచర్‌ని ట్రై చేయొచ్చు.

మీ డివైజ్ లోని సెట్టింగ్స్ యాప్‌ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాల్‌పేపర్ & స్టైల్‌పై ప్రెస్ చేయండి. కలర్స్ వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు మీకు థీమ్ పాలెట్ పాప్ అప్ డిస్ ప్లే అవుతుంది. అప్పుడు మీకు నచ్చిన ఏదైనా థీమ్‌ను ఎంచుకోవచ్చు.

Read Also : Airtel Xstream Premium : ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త.. రూ.149కే 15 OTT వీడియో స్ట్రీమింగ్‌ ప్రీమియం సర్వీసులు

ట్రెండింగ్ వార్తలు