Apple Back School Offer : విద్యార్థులకు ఆపిల్ ఆఫర్.. ఐప్యాడ్, మాక్‌బుక్ కొనుగోలుపై ఫ్రీ ఎయిర్‌పాడ్స్‌

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ భారత విద్యార్థుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్ ప్రోగ్రామ్‌ (Back To Offer)ను ప్రవేశపెట్టిన ఒక నెల తర్వాత ఇండియాలోకి తీసుకొచ్చింది.

Apple Back School Offer : విద్యార్థులకు ఆపిల్ ఆఫర్.. ఐప్యాడ్, మాక్‌బుక్ కొనుగోలుపై ఫ్రీ ఎయిర్‌పాడ్స్‌

Apple Back School Offer

Updated On : July 17, 2021 / 9:05 AM IST

Apple Back School Offer : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ భారత విద్యార్థుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్ ప్రోగ్రామ్‌ (Back To Offer)ను ప్రవేశపెట్టిన ఒక నెల తర్వాత ఇండియాలోకి తీసుకొచ్చింది. ఆపిల్ స్టోర్ నుంచి ఆపిల్ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే.. బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కింద ఉచితంగా బిగ్ ఎయిర్ ప్యాడ్ సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ పరిమిత కాల ఆఫర్ మాత్రమే.. భారత్‌లోని యూనివర్శిటీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆపిల్ ఇప్పటికే కొన్ని ఆఫర్లను అందిస్తోంది. ఐప్యాడ్ ప్రో (మోడల్), ఐప్యాడ్ ఎయిర్ (మోడల్), మాక్‌బుక్ ఎయిర్ (మోడల్), మాక్‌బుక్ ప్రో (మోడల్), ఐమాక్ (మోడల్), మాక్ ప్రో, మాక్ మినీ కొనుగోలు చేసే విద్యార్థులు సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా పొందవచ్చు.

వైర్డ్ ఛార్జింగ్ ఎయిర్‌పాడ్స్ మోడల్‌లో హై వెర్షన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఎయిర్‌పాడ్స్‌కు రూ .4 వేలు, ఎయిర్‌పాడ్స్ ప్రోకు రూ .10వేలకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌పాడ్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్‌పాడ్స్ ప్రో అసలు ధర వరుసగా రూ .14,900, రూ .18,900, రూ .24,900గా ఆఫర్ అందిస్తోంది. ఉచిత ఎయిర్‌పాడ్స్‌తో పాటు, ఆపిల్ కొన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్ అందిస్తుంది. విద్యార్థులు డిస్కౌంట్‌తో మాక్‌బుక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆపిల్‌ కేర్‌ను 20 శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఆపిల్ మ్యూజిక్‌కు నెలకు రూ. 49 చొప్పున ఉచిత ఆపిల్ టీవీ+ చందాతో పాటు 3 నెలల వరకు ఉచితంగా ఆపిల్ ఆర్కేడ్ సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు.

ఆపిల్ పెన్సిల్, కీబోర్డుపై ఎడ్యుకేషనల్ తగ్గింపు ఉంది. ఆపిల్ బ్యాక్ టు స్కూల్ డిస్కౌంట్ పొందాలంటే.. భారత్‌లో రిజిస్టర్డ్ స్కూల్ లో విద్యార్థి అయి ఉండాలి. ఆఫర్ కోసం మీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. UNIDDAYS ద్వారా ఆపిల్ ధృవీకరిస్తుంది. ధృవీకరణ పోర్టల్‌లో మీ విద్యార్థి ఐడి నంబర్, పాఠశాల చిరునామా వంటి వివరాలను ఇవ్వాలి. UNiDAYS ధృవీకరణ తర్వాత, ఆపిల్ మీ అకౌంట్‌ను బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కింద డిస్కౌంట్ అందిస్తుంది. మీకు ఇష్టమైన ఐప్యాడ్ లేదా మ్యాక్‌ను కొనుగోలు చేయవచ్చు. పెయిర్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా పొందవచ్చు. ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ చదువుతున్న లేదా పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ ఆఫర్ పొందవచ్చు.