Apple Back to School Sale 2024 : భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ పెన్సిల్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు!

Apple Back to School Sale 2024 : ఈ ఏడాదిలో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు పవర్‌పుల్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో వంటి పాపులర్ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను పొందవచ్చు.

Apple Back to School Sale 2024 : భారత్‌లో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ సేల్.. ఐప్యాడ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్, ఆపిల్ పెన్సిల్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు!

Apple back to school sale 2024 in India ( Image Source : Google )

Apple Back to School Sale 2024 : భారత్‌లోని ఆపిల్ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్యాక్ టూ స్కూల్ సేల్ అధికారికంగా ప్రారంభమైంది. తక్కువ ఖర్చుతో మీ డివైజ్‌లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఈ జూన్ 20న ప్రారంభమైన ఈ సేల్ సెప్టెంబరు 20 వరకు కొనసాగుతుంది. ఈ ఆకర్షణీయమైన డీల్స్‌ను విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవచ్చు.

ఆపిల్ సేల్‌లో భారీ తగ్గింపులు, ఉచిత ఎయిర్‌పాడ్‌లు :
ఈ ఏడాదిలో ఆపిల్ బ్యాక్ టు స్కూల్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు పవర్‌పుల్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో వంటి పాపులర్ ప్రొడక్టులపై భారీ తగ్గింపులను పొందవచ్చు. రెండూ ఆపిల్ లేటెస్ట్ M2, M4 చిప్‌సెట్‌ల ద్వారా అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ అప్‌గ్రేడ్ కోరుకునే వారికి M2 లేదా సరికొత్త M3 చిప్‌తో లభించే సొగసైన మ్యాక్‌బుక్ ఎయిర్, పవర్‌ఫుల్ M3 చిప్‌ని కలిగిన ప్రొఫెషనల్-గ్రేడ్ మ్యాక్‌బుక్ ప్రోతో పాటు ఆఫర్‌లో ఉంది. M3 చిప్‌సెట్‌తో కూడిన స్టైలిష్ ఐమ్యాక్ (2023), M2 చిప్‌తో కూడిన కాంపాక్ట్ ఇంకా సామర్థ్యం ఉన్న మ్యాక్ మినీ (2023) కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Apple iPhone 15 : కొత్త ఐఫోన్ కావాలా భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

ఎంపిక చేసిన కొనుగోళ్లతో ఫ్రీ ఎయిర్‌పాడ్‌లను (3వ జనరేషన్) అందిస్తోంది. క్వాలిఫైయింగ్ మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో, ఐమ్యాక్ లేదా మ్యాక్ మినీ కొనుగోలు చేయండి. ఎయిర్ ప్యాడ్స్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా ఉచితంగా పొందండి. అదనంగా, ఐప్యాడ్ ఎయిర్ కొనుగోలుదారులు కాంప్లిమెంటరీ ఆపిల్ పెన్సిల్‌ను పొందవచ్చు. ఐప్యాడ్ ప్రోను ఎంచుకునే వారు ఉచిత ఆపిల్ పెన్సిల్ ప్రోని అందుకుంటారు. అందులో నోట్ టేకింగ్, డ్రాయింగ్, క్రియేటివిటీని వెలికితీసేందుకు సరైన టూల్స్‌గా చెప్పవచ్చు.

ఆపిల్ బ్యాక్-టు-స్కూల్ డీల్స్‌ మీకోసం :
ఐప్యాడ్ ఎయిర్ (2024) : 11-అంగుళాల వేరియంట్ ధరలు రూ. 54,990, అయితే, 13-అంగుళాల మోడల్ ప్రారంభ ధర రూ. 74,990కు పొందవచ్చు. రెండు సైజుల్లో వై-ఫై, వై-ఫై+ సెల్యులార్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి కొనుగోలుకు ఉచితంగా ఆపిల్ పెన్సిల్ విలువ (రూ. 6,900) లభిస్తుంది.

ఐప్యాడ్ ప్రో (2024) : 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 89,900, 13-అంగుళాల మోడల్ ప్రారంభ ధర రూ. 1,19,900, రెండూ వై-ఫై మాత్రమే, వై-ఫై+ సెల్యులార్ వేరియంట్‌లను అందిస్తాయి. ఫ్రీ ఆపిల్ పెన్సిల్ ప్రో (రూ. 10,900) డీల్‌ను అందిస్తుంది.

మ్యాక్‌బుక్ ఎయిర్ : ఎం2-పవర్డ్ మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు రూ. 89,990, కొత్త ఎం3 మోడల్స్ ప్రారంభ ధర రూ. 1,04,900. ఆపిల్ ప్రతి మ్యాక్‌బుక్ ఎయిర్ కొనుగోలుతో ఒక జత ఉచిత ఎయిర్‌పాడ్‌లను (3వ జనరేషన్ ) అందిస్తోంది. ఈ మ్యాక్‌బుక్ విలువ రూ. 19,900 ఉంటుంది.

మ్యాక్‌బుక్ ప్రో (2023) : 14-అంగుళాల మోడల్ ప్రారంభ ధర రూ. 1,58,900, 16-అంగుళాల మోడల్ రూ. 2,29,900. మ్యాక్‌బుక్ ఎయిర్ మాదిరిగా ప్రతి మ్యాక్ బుక్ ప్రోకొనుగోలులో కూడా ఉచితంగా జత ఎయిర్ ప్యాడ్స్ (3వ జనరేషన్) ఉంటాయి.

ఐమ్యాక్ (2023) మ్యాక్ మినీ (2023) : ఐమ్యాక్ (2023) ప్రారంభ ధర రూ. 1,29,900, మ్యాక్ మినీ (2023) ప్రారంభ ధర రూ. 49,900. ఈ రెండు డివైజ్‌లు బోనస్‌గా ఎయిర్‌పాడ్‌ల (3వ జనరేషన్) ఫ్రీ సెట్‌తో వస్తాయి.

Read Also : Apple Cheaper Vision Pro : అందుకే.. ఆపిల్ చౌకైన కొత్త విజన్ ప్రో తీసుకొస్తోంది.. ఐఫోన్ ధరతో సమానంగా ఉంటుందట!