ఐ ఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి ఆఫర్

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 10:29 AM IST
ఐ ఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి ఆఫర్

Updated On : October 12, 2020 / 10:34 AM IST

apple diwali offer : పండుగల సీజన్ వచ్చేస్తోంది. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని వ్యాపారవర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రధానంగా సెల్ కంపెనీలు వివిధ ఆఫర్స్ తో ముందుకొస్తున్నాయి. Apple ఇండియా సైతం..తమ ఐ ఫోన్ అమ్మకాలపై ఆఫర్స్ ప్రకటించింది.



ఐ ఫోన్ ( iPhone 11 ) 11ని కొనుగోలు చేసిన వారికి ఎయిర్ పాడ్స్ (AirPods) ను ఉచితంగా అందించనున్నట్లు యాపిల్ వెల్లడించింది. ఐఫోన్ 11 మొబైల్‌పై ఈ నెల 17 నుంచి దీపావళి వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.



64 GB ఇంటర్నల్‌ మెమరీ కలిగిన ఐఫోన్‌ 11 ధర రూ.68,300 ఉండగా, 128 GB మెమరీ కలిగిన ఐఫోన్ ధర రూ.73,600 పలుకుతోంది. 256 GB ఇంటర్నల్ మెమొరీ వేరియెంట్ ఐఫోన్ 11 ధర రూ.84,100 కి లభిస్తోంది



చార్జింగ్ కేస్‌తో వచ్చే ఎయిర్‌పాడ్స్ ఖరీదు రూ.14,900 ఉందని అంచనా. వైర్‌లెస్ చార్జింగ్ కేస్‌తో లభించే ఎయిర్‌పాడ్స్ ఖరీదు రూ.18,900, ఎయిర్‌పాడ్స్ ప్రో కోసమైతే రూ.24,900.