యాపిల్ ఫోన్లు స్లో అయ్యాయని రూ.196కోట్ల జరిమానా

కస్టమర్లకు చెప్పకుండా ఫోన్లు స్లో అయ్యేలా చేసినందుకు యాపిల్ కంపెనీకి రూ.196కోట్ల జరిమానా విధించారు. France’s competition, fraud watchdog DGCCRFలు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. 2017లో కొన్ని ఐ ఫోన్లు స్లో డౌన్ అయ్యాయని యాపిల్ నిర్దారించింది. ఇదంతా వాటి జీవితకాలం పెంచడం కోసమే చేసినట్లు తేల్చాయి.
చాలా కాలంగా కస్టమర్లు ఐ ఫోన్లు స్లో అవడాన్ని గమనించి.. కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం కోసమే ఇలా చేస్తుందని ఆరోపించుకుంటూ గడిపేస్తున్నారు. 2017లో కంపెనీ ఫోన్ల లైఫ్ పెంచడం కోసమే చేశామని అంతేకానీ ఫోన్లు మార్చుకోవడం కోసం కాదని వెల్లడించింది. ఐ ఫోన్లలో ఉండే లిథియమ్ అయాన్ బ్యాటరీల సామర్థ్యం చాలా తక్కువ మొత్తంలో మాత్రమే స్టోర్ చేసుకోగలదు.
దీంతో ఫోన్ల లైఫ్ టైం తగ్గుతుంది. ఐ ఫోన్లలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు సేఫ్ గా ఉండాలని ఇలా చేశారట. ఐ ఫోన్6, ఐ ఫోన్6ఎస్, ఐ ఫోన్ ఎస్ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి బ్యాటరీ లైఫ్ పెరిగేలా చేశాయి.
మరి ఐ ఫోన్లు ఇప్పటికీ స్లోగానే పనిచేస్తున్నాయా.. అంటే నిజమే అలానే ఉన్నాయి. 2017 నుంచి అదే పరిస్థితిలో ఉంటున్నాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఆ ఫోన్ల వివరాలిలా ఉన్నాయి.
- iPhone 6, 6 Plus, 6S, 6S Plus
- iPhone SE
- iPhone 7, iPhone 7 Plus
- iPhone 8, iPhone 8 Plus
- iPhone X(< iOS 12.1)
- iPhone XS, XS Max and XR running ((< iOS 13.1)